కాజల్‌ చివరి ప్రయత్నం.. ఇది ఫలిస్తే మరో 5 యేళ్లు ఆమె బిజీ బిజీ

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ కాజల్‌ గత కొన్నాళ్లుగా ఛాన్స్‌లు లేక ఖాళీగా ఉంటుంది.

వచ్చిన ఒకటి రెండు ఆఫర్లు కూడా ఆమెకు గుర్తింపును తెచ్చి పెట్టడం లేదు.

దాంతో ఆమె కెరీర్‌ ఖతం అయ్యిందని నెటిజన్స్‌ అంటున్నారు.ఇదే సమయంలో ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈమకు ఆఫర్లు వచ్చేది కష్టమే.సీనియర్‌ హీరోలు మరియు స్టార్‌ హీరోలు ఎవరు కూడా ఈమెను ఛాయిస్‌గా తీసుకోవడం లేదు.

అత్యంత అవసర సమయంలోనే ఈమెను తీసుకుంటున్నారు.ఆమద్య ఆచార్య నుండి త్రిష తప్పుకోవడంతో వెంటనే మరో హీరోయిన్‌ దొరక్క పోవడంతో కాజల్‌ను ఎంపిక చేయడం జరిగింది.

Advertisement
Kajal Agarwal Want To Act In Lady Oriented Movies, Kajal Agarwal, Tollywood, Chi

ఆచార్య తర్వాత కాజల్‌ మళ్లీ బిజీ అవుతుందనే నమ్మకం ఎవరికి లేదు.అందుకే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాన్ని చేయాలని ఈమె భావిస్తుంది.

Kajal Agarwal Want To Act In Lady Oriented Movies, Kajal Agarwal, Tollywood, Chi

తమిళంలో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు మంచి డిమాండ్‌ ఉంది.అక్కడ వరుసగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేయాలని భావిస్తుంది.అందుకోసం స్క్రిప్ట్‌లు వింటుంది.

పారితోషికం తగ్గించుకోవడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా కూడా మారి మేకర్స్‌ను ఆకర్షిస్తుంది.దాంతో ఈమె లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు వరుసగా చేయబోతుందని తెలుస్తోంది.

రెండు మూడు చిత్రాలు సక్సెస్‌ అయితే మరో అయిదు సంవత్సరాల పాటు ఈ అమ్మడు బిజీ బిజీగా గడిపే అవకాశం ఉంది.మరి కాజల్‌ ప్లాన్స్‌ వర్కౌట్‌ అయ్యేనా చూడాలి.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు