నిన్న సమంత నేడు నయనతార వచ్చి అంచనాలు పెంచేస్తున్నారు

టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్స్ గా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మలు నయనతార మరియు సమంతలు కలిసి నటించిన తమిళ సినిమా కాతువాకుల రెండు కాదల్ విడుదలకు సిద్దం అయ్యింది.

డిసెంబర్ లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

డిసెంబర్‌ లో విడుదల తేదీ విషయంపై అతి త్వరలోనే స్పష్టత వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.ఇక ఈ సినిమా లో హీరోయిన్‌ లు గా నటిస్తున్ సమంత మరియు నయనతార ల ఫస్ట్‌ లుక్‌ లకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ పోస్టర్ లను విడుదల చేయడం జరిగింది.

నిన్న సమంత లుక్ రావడంతో పాటు సినిమా పై అంచనాలు పెరిగాయి.ఇప్పుడు నయనతార లుక్ ను చిత్ర యూనిట్‌ సభ్యులు రివీల్‌ చేయడం జరిగింది.

ఈ సినిమా లో నయనతార కన్మణి గా కనిపించబోతుంది.చీర కట్టులో పద్దతైన పాత్రలో నయనతార కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Kaathuvaakula Rendu Kaadhal Movie Nayana Tara First Look,latest Tollywood News
Advertisement
KaathuVaakula Rendu Kaadhal Movie Nayana Tara First Look,latest Tollywood News-

ఇక ఈ సినిమా లో విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.ఇప్పటికే ఆయన పాన్ ఇండియా స్టార్‌ గా దూసుకు పోతున్నాడు.ఇలాంటి సమయంలో ఇద్దరు స్టార్‌ హీరోయిన్స్ తో కలిసి ఈయన నటించడం చర్చనీయాంశం అయ్యింది.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను తమిళ ఆడియన్స్ మల్టీ స్టారర్ అంటూ ఆకాశానికి అంచనాలు ఎత్తేస్తున్నారు.చిన్న బడ్జెట్‌ తో రూపొందినా కూడా ఈ సినిమా స్టార్‌ కాస్టింగ్ తో భారీ సినిమా గా మారి పోయింది.

నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్ ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నాడు.సినిమాలో హీరోయిన్స్ గా నటించిన ఇద్దరు కూడా పోటా పోటీగా నటించినట్లుగా చెబుతున్నారు.సినిమా లో విజయ్‌ సేతుపతి భార్య గా నయన తార కనిపించబోతుండగా.

ఆయన ప్రియురాలి పాత్రలో సమంత కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.నయన్ మరియు సమంతల మద్య వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంటాయని అంటున్నారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు