జ్యో అచ్యుతానంద మూవీ రివ్యూ

చిత్రం : జ్యో అచ్యుతానంద బ్యానర్ : వారాహి చలనచిత్రం దర్శకత్వం : శ్రీనివాస్ అవసరాల నిర్మాత : సాయి కొర్రపాటి సంగీతం : కళ్యాణ్ కోడూరి విడుదల తేది : సెప్టెంబరు 9, 2016 నటీనటులు : నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా తదితరులు దర్శకత్వం వహించిన తొలిచిత్రం "ఊహలు గుసగుసలాడే" తో అభిరుచి గల రచయితగా, ఫిలింమేకర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు శ్రీనివాస్ అవసరాల.

అదే వారాహి సంస్థ ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ దర్శకత్వంలో "జ్యో అచ్యుతానంద" నిర్మించింది.

ఇక హిట్ కోసం తహతహలాడుతున్న నారా రోజిత్, నాగశౌర్య తో పాటు అందాల భామ రెజీనా ఈ సినిమాలో నటించింది.మరి ట్రేడ్ లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం.

కథలోకి వెళ్తే .సినిమా లైన్ చాలా సింపుల్.అచ్యుతరామరావు, ఆనందవర్థన్ రావు (నారారోహిత్, నాగశౌర్య) ఇద్దరు అన్నదమ్ములు.

ఇద్దరు ఒకే అమ్మాయి (జ్యోత్స్న) ని ప్రేమిస్తుంటారు.ఈ అమ్మాయి ఇద్దరు అన్నదమ్ముల బంధంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? వారి చుట్టు ఉన్న భావోద్వేగాలు ఎంటి సంఘర్షణలో పడ్డాయో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.నటీనటుల నటన గురించి నారా రోహిత్ నటన అద్యంతం అద్భుతంగా సాగింది.

Advertisement

ముఖ్యంగా రోహిత్ ఉచ్చారణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.తన స్టయిల్లోనే అవసరాల మాటలు బాగా చెప్పాడు.

ఫ్లాష్ బ్యాక్ తరువాత ఒక సన్నివేశంలో, సెకండాఫ్ లో వచ్చే అన్నదమ్ముల సంభాషణలో రోహిత్ చాలా బాగా నటించాడు.కాని లుక్ పరంగా మాత్రం తనని తాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నాగశౌర్య మరోసారి తనకి తగ్గ పాత్ర దొరికితే ఎంత బాగా మెప్పించగలడో నిరూపించుకున్నాడు.సినిమా చివరి దశలో నాగశౌర్య అభినయం మెచ్చుకోదగ్గది.

రెజీనా తన హావాభాలతో ఆకట్టుకుంది.సింపుల్, సబ్టిల్ గా రెజీనా నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు దర్శకుడు అవసరాల.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
1000 కోట్లతో చరిత్ర సృష్టించిన పుష్పరాజ్.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే!

నాని తళ్ళుకున్న మెరవడం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ.సాంకేతికవర్గం పనితీరు ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి అందించిన సంగీతం గురించి చాలాసేపు మాట్లాడుకోవచ్చు.

Advertisement

"ఒక లాలన", టైటిల్ సాంగ్ ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో, నేపథ్య సంగీతం అంతే బాగుంది.అవసరాల - కళ్యాణ్ యొక్క అనుబంధం ఇప్పటిది కాదు.

అందుకే తన సినిమాలకి ఇంత అందమైన సంగీతం బయటకి వస్తోంది.ఇక వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫి మరో ప్రధాన ఆకర్షణ.

సినిమా మొత్తాన్ని ఒకే మూడ్ లో ఉంచడంలో సఫలీకృతులు అయ్యారు కెమెరా డిపార్టుమెంటు వారు.ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది.

వారాహి నిర్మాణ విలువలు ఎప్పటిలాగే బాగున్నాయి.ఇక శ్రీనివాస్ అవసరాలే ఈ చిత్రానికి ప్రధాన హీరో.

"వన్ లైనర్స్" తో తనలోని రచనాచాతుర్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు అవసరాల.నిజం చెప్పాలంటే తెలివిగా సంభాషణ రాయగల అతికొద్దిమంది తెలుగు రచయితల్లో అవసరాల కూడా ఒకరు.

విశ్లేషణ ముక్కోణపు ప్రేమకథలు తెలుగు సినిమాలో కొత్తేం కాదు.కాని ఓ ముక్కోణపు ప్రేమకథని మరోకోణంలో చూపించే ప్రయత్నం చేశాడు శ్రీనివాస్ అవసరాల.

ఎంచుకున్న స్క్రీన్ ప్లే తెలుగు సినిమాల వరకు కొత్తదే అని చెప్పాలి.టైటిల్స్ దగ్గరి నుంచి ఇంటర్వల్ దాకా రచయితగా తన పదును చూపిస్తూ, ఎక్కడా కథలోంచి డీవియేట్ అవకుండా కూర్చోబెట్టగలిగిన అవసరాల, సెకండాఫ్ లో మాత్రం గురి తప్పాడు.

ఎడిటింగ్ లోటుపాట్లు అన్ని ఇక్కడే బయటపడతాయి.కాని సెకండాఫ్ ని పూర్తిగా తీసిపారేయలేం.

సినిమా అంటే బిజినెస్ కాబట్టి, బాక్సాఫీస్ దగ్గర అన్నివర్గాల వారిని మెప్పించే సినిమా మాత్రం కాదు.ఎడిటింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది.

ఒవరాల్ గా చూడదగ్గ సినిమా.క్లాస్ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అన్నదాని మీదే సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది.హైలైట్స్ : * సంభాషణలు * పాత్రలు, పాత్రల అభినయం * సంగీతం * ఫస్టాఫ్ డ్రాబ్యాక్స్ : * ఎడిటింగ్ * సెకండాఫ్ నరేషన్ * కేవం A సెంటర్స్ ఆడియెన్స్ ని కూర్చోబెట్టే కంటెంట్ చివరగా : "జ్యో అచ్యుతానంద" లాలి పాడినంత హాయిగా ఉంటుంది, అక్కడక్కడ నిద్రపుచ్చినంత పని చేస్తుంది.

తెలుగుస్టాప్ రేటింగ్ : 3/5

.

తాజా వార్తలు