జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

నల్లగొండ జిల్లా:జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దశ దినోత్సవం( Telangana state formation decade ) సందర్భంగా వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులు,సిబ్బందికి అవార్డులను అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ డా.కెవి.

రమణారెడ్డి( Dr.KV.Ramana Reddy ) తెలిపారు.గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగావార్డ్,టౌన్ పరిధిలో శానిటేషన్,వాటర్ సప్లయ్, స్ట్రీట్ లైటింగ్ లో ఉత్తమ సేవలు అందించిన వారికి, క్రమంగా తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించిన వారికి,ఉత్తమ సమభావన సంఘాలకు, ఉత్తమ వీధివ్యాపారులకు, ఉత్తమ మిద్దె తోటలు నిర్వహించేవారికి,ముగ్గుల పోటీల్లో విజేతలకు,డిఆర్ సీసీ నిర్వహణ చేసిన వారికి అవార్డులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

అంతే కాకుండా నర్సరీ,పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహించే వారికి,ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో మొక్కల పెంపకం సక్రమంగా చేసిన వారికి, ఉత్తమ స్లామ్ లెవల్ ఫెడరేషన్,ఉత్తమ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్,ఉత్తమ బ్యాంకర్లకు,సమభావన సంఘాలచే తయారు చేయబడిన ఉత్పత్తులకు అవార్డులను అందజేయనున్నట్లుచెప్పారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి మాసాద్ అహ్మద్, ఈఈ రాములు,ఏసిపి నాగిరెడ్డి,వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మేం దాడికి దిగితే ఒక్క కాంగ్రెస్ ఆఫీస్, నాయకుడు మిగలరు
Advertisement

Latest Nalgonda News