జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుకలను విజయవంతం చేయాలి

సూర్యాపేట జిల్లా:జిల్లాలో జూన్ 2 న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను( Telangana State Inauguration Day Celebrations ) ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను జూన్ 2 కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులకు దిశనిర్దేశయం చేసి, మైదానాన్ని పరిశీలించారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ద్వారా పరేడ్ గ్రౌండ్ ను సదును చేసి, అందుబాటులో ఉంచాలన్నారు.అలాగే కార్యక్రమాలు వీక్షించే వారికి త్రాగునీటి వసతి కల్పించాలని,విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం విద్యుత్ ఉండేలా చూడాలని, మెడికల్ స్టాల్ ఏర్పాటు చేసి వైద్యులు,సిబ్బందిని అందుబాటులో ఉంచాలని,విద్యాశాఖ ఆధ్వర్యంలో కల్చరల్ కార్యక్రమాలు చేపట్టాలని, ఆర్ అండ్ బి శాఖ ద్వారా స్టేజీతో పాటు గ్యాలరీలు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రోటోకాల్, స్టేజీ, వీఐపి గ్యాలరీలు ఏర్పాటుతో పాటు పర్యవేక్షణ చేయాలని, అలాగే పోలీస్ శాఖ ద్వారా పరేడ్ నిర్వహణ,అగ్ని మాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్టాల్స్, జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై శకటాలను ఏర్పాటు చేయాలన్నారు.కార్యక్రమం నిర్వహణలో భాగంగా సౌండ్ సిస్టంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జీ డిఆర్ఓ కిషోర్ కుమార్, పిడి కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామనుజులరెడ్డి, తహసీల్దార్ వెంకన్న, పోలీస్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
హుజూర్ నగర్ గృహజ్యోతి పథకానికి పట్టిన గ్రహణం

Latest Suryapet News