Jayasudha: 64 ఏళ్ల వయసులో మూడో పెళ్లిచేసుకోబోతున్న జయసుధ.. మరోసారి ప్రియుడితో కనిపించి..!!

సీనియర్ నటి జయసుధ (Jayasudha) గురించి గత కొన్ని రోజుల ముందు మూడో పెళ్లి చేసుకోబోతుందని, అందుకే పబ్లిక్ గా ఆ వ్యక్తితో కలిసి ఫంక్షన్లకు, ఈవెంట్లకు వస్తుంది అంటూ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయంపై సీనియర్ నటి జయసుధ (Jayasudha) మాట్లాడుతూ.

నేను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదని ఆయన యుఎస్ నుండి వచ్చారని, ఆ వ్యక్తి నా బయోపిక్ ని డాక్యుమెంటరీ గా తెరకెక్కించడం కోసమే ఇక్కడికి వచ్చారు అంటూ క్లారిటీ ఇచ్చింది.కానీ ఈ విషయంలో ఎవరు కూడా జయసుధ ని నమ్మలేదు.

అయితే తాజాగా మరోసారి ప్రియుడి తో కలిసి కనిపించింది జయసుధ.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.తాజాగా ఏఎన్నార్(ANR) శతజయంతి ఉత్సవాలు మొదలయ్యాయి.ది గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు జరపాలని అక్కినేని ఫ్యామిలీ అనుకోవడంతో ఈయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.రాజమౌళి,రామ్ చరణ్,మోహన్ బాబు, మహేష్ బాబు(Mahesh babu), నాని,సురేష్ బాబు, జయసుధ, బ్రహ్మానందం వంటి వాళ్లు పాల్గొన్నారు.

అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ఏఎన్ఆర్ పంచలోహ విగ్రహాన్ని మాజి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkayya naidu) చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేశారు.అయితే ఈ ఈవెంట్ లో జయసుధ ఓ వ్యక్తితో కనిపించింది.ఇక ఆ వ్యక్తి ఎవరో కాదు.

జయసుధ ఎవరినైతే మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయో ఆ వ్యక్తితో మరోసారి కనిపించి మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.అయితే ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకొని 64 ఏళ్ల వయసులో ఉన్న జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు ఎన్నో వినిపించాయి.

అయితే తాజాగా మరోసారి కూడా ఆ వ్యక్తితో జయసుధ (Jayasudha) కనిపించేసరికి జయసుధ మూడో పెళ్లి వార్తలు మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఆ విలన్ పాత్ర వల్లే జయప్రకాష్ రెడ్డి కెరీర్ మలుపు తిరిగిందట.. ఈ విషయాలు తెలుసా?
Advertisement

తాజా వార్తలు