జగన్ తిరుమల పర్యటన... జనసేన దూరం 

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం లో కల్తీ నెయ్యి ఉపయోగించారని,  దీనికి గత వైసిపి ప్రభుత్వం లోని పెద్దలే కారణం అని టిడిపి , జనసేన, బిజెపి కాంగ్రెస్ లు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో,  వైసిపి అధినేత జగన్( YS Jagan ) నేడు తిరుపతికి వస్తున్నారు .

రేపు ఉదయం తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకోనున్నారు.

  అయితే జగన్ పర్యటనను అడ్డుకునేందుకు టిడిపి,  బిజెపి, జనసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలకు దిగాలని ముందుగా నిర్ణయించుకున్నా,  ఈ విషయంలో జనసేన అధినేత,  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy CM Pawan Kalyan ) సంచలన నిర్ణయం తీసుకున్నారు.జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ముందుగా డిక్లరేషన్( Declaration ) ఇచ్చి తీరాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తూ ఉండడం,  ముఖ్యంగా ఈ విషయంలో బిజెపి , హిందూ సంఘాలు జగన్ తిరుమల పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళన నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో,  పవన్ ఈ నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన శ్రేణులకు స్పష్టం చేశారు.

Janasena Staying Away Form Ys Jagan Tirumala Tour Issue Details, Tirumala Laddu

జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ( TTD ) చూసుకునే ప్రక్రియ.  జగన్ విషయంలో ఆయన మతాన్ని,  ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడాల్సిన సమయం కాదు ఇది .వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడవద్దు.  ఆ ప్రక్రియ పై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటన , డిక్లరేషన్ అంశాలకు జనసేన నేతలు దూరంగా ఉండాలని పవన్ ఆదేశించారు.పవన్ తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.

Advertisement
Janasena Staying Away Form Ys Jagan Tirumala Tour Issue Details, Tirumala Laddu

ఇక జగన్ తిరుమల పర్యటన రాజకీయంగా ఉత్కంఠ కలిగిస్తోంది.ఈరోజు సాయంత్రం  4.50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు.

Janasena Staying Away Form Ys Jagan Tirumala Tour Issue Details, Tirumala Laddu

ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్తారు.  రాత్రి 7 గంటలకు తిరుమల( Tirumala ) చేరుకుంటారు.  రేపు ఉదయం 10:30 కు తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకోనున్నారు.  జగన్ కు స్వాగతం పలికేందుకు వైసిపి శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

  అయితే జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకోవాలని,  లేదంటే అలిపిరి వస్తే అడ్డుకుంటామని బిజెపి హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి .ఈ వ్యవహారం ఇలా ఉండగానే జగన్ పర్యటనకు జనసేన శ్రేణులు దూరంగా ఉండాలని పవన్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు