వైసీపీలో మార్పు.. మంచికేనా ?

ఏపీలో ఎన్నికల ముందు అధికార వైసీపీలో( YCP ) ఎవరు ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.వచ్చే ఎనికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఉన్న అధినేత వైఎస్ జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

 Is The Change In Ycp Good , Ycp, Politics, Ys Jagan, 30 To 40 Mlas, Jagan Mohan-TeluguStop.com

ముఖ్యంగా పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఎన్నికల సమయానికి పూర్తిగా బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నారు.ఇప్పటికే 11 నియోజక వర్గాల్లో ఇంచార్జ్ ల మార్పుతో పోలిటికల్ హిట్ పెంచిన వైస్ జగన్ ఇక ముందు రోజుల్లో ఎలాంటి మార్పులు చేపడతారనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ, పార్టీ వర్గాల్లోనూ జోరుగా సాగుతోంది.

Telugu Mlas, Change Ycp, Ys Jagan-Politics

ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.గత కొన్నాళ్లుగా 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై వైఎస్ జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.తీరు మార్చుకోవాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని ఆయా ఎమ్మెల్యేలకు పలుమార్లు సూచించారు కూడా.తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని కూడా హెచ్చరించారు.ఈ నేపథ్యంలో దాదాపు 75 నుంచి 80 స్థానాల్లో సిట్టింగ్ లను మార్చేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు వినికిడి.అదే గనుక నిజం అయితే జగన్ డేరింగ్ స్టెప్ వేస్తున్నారనే చెప్పవచ్చు.

Telugu Mlas, Change Ycp, Ys Jagan-Politics

ఎందుకంటే వైసీపీలోని చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది.అందువల్ల కొన్ని స్థానాల్లో సిట్టింగ్ లను మార్చడం సబబే.కానీ ఏకంగా 70-80 స్థానాల్లో సిట్టింగ్ లను మార్చితే ఆ ప్రభావం పార్టీపై పడుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఎందుకంటే పార్టీలో అసంతృప్త వాదులు పెరిగే అవకాశం ఉందని వారంతా కూడా పార్టీ వీడిన ఆశ్చర్యం లేదని చెబుతున్నారు విశ్లేషకులు.

మరి వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) తన వ్యూహాలతో పార్టీలో ఎలాంటి ఎలాంటి మార్పులు తీసుకొస్తారనే చర్చ జరుగుతోంది.ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నా మార్పులు మంచికే అని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు.

మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube