వైసీపీలో ఆ యువ‌నేతే ఇప్పుడు హాట్ టాపిక్‌... ఒకే ఒక్క‌డు ?

యువ నాయ‌కుడు, వైసీపీలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న దేవినేని అవినాష్‌ విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

తూర్పు నియోన‌జ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న ఆయ‌న‌కు ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కమ‌నే చెప్పాలి.

ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన యువ నాయ‌కుడు రెండు సార్లూ ఓడిపోయారు.దీనికి వివిధ కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ స‌మకాలీన రాజ‌కీయాల్లో అవినాష్ త‌న స‌త్తా ఫ్రూవ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

అవినాష్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.గ‌త రెండు సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ప్పుడు ఆయ‌న‌కు కాలం క‌లిసి రాలేదు.

ఓ సారి ముస‌లి కాంగ్రెస్ నుంచి మ‌రోసారి నాన్ లోక‌ల్ అయిన గుడివాడ‌లో పోటీ చేసి ఓడిపోయారు.ఈ క్ర‌మంలో తాజాగా వ‌చ్చిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Advertisement

వాస్త‌వానికి విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై దేవినేని నెహ్రూ ముద్ర ఇప్ప‌టికీ ఉంది.అయితే ఆ త‌ర్వాత దేవినేని అవినాష్‌ కొన్నాళ్లు టీడీపీలో ఉన్నారు.

ఫ‌లితంగా సీనియ‌ర్లు ఆయ‌న‌ను ఎద‌గ‌నివ్వ‌లే ద‌నే ముద్ర ఉంది.దీంతో ఎట్ట‌కేల‌కు ఆయ‌న వైసీపీ బాట‌ప‌ట్టారు.

ఇక్క‌డ ఆయ‌న‌కుఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.నేరుగా సీఎం జ‌గ‌న్‌తోనే స‌త్సంబాలు ఉన్న నేత‌గా ఆయ‌న గుర్తింపు పొందారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకున్నా నేరుగా ప్ర‌జ‌ల‌ను క‌లిసినా ఇబ్బంది లేకుండా పోయింది.ఈ క్ర‌మంలో ఈ హ‌వాను నిల‌బెట్టుకునేందుకు విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌పై వైసీపీ జెండాను ఎగ‌రేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

గ‌త ఏడాది కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైన నాటి నుంచి కూడా అవినాష్ దూకుడు పెంచారు.ఎన్నిక‌లు వాయిదా ప‌డిన త‌ర్వాత కూడా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఆప‌లేదు.క‌రోనా స‌మ‌యంలోనూ దేవినేని ట్ర‌స్టు ద్వారా సేవ‌లు కొన‌సాగించారు.

Advertisement

కొండ ప్రాంతాల్లో కూడా ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించి వారి సాధ‌క బాధ‌లు విన్నారు.స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు కృషి చేశారు.

ఇక‌ ఇప్పుడు కూడా వైసీపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని ఉద‌యం ఆరు గంట‌ల నుంచే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు.దీంతో ఆయ‌న‌ను చూసి మిగిలిన నాయ‌కులు కూడా క్యూ క‌డుతున్నారు.

అవినాష్ దూకుడు ముందు తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌కు సైతం ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి.ఇప్పుడు పుర‌పోరులో తూర్పులో స‌త్తా చాటితే అవినాష్ క్రేజ్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర స్కై రేంజ్‌కు వెళ్లిపోతుంది అన‌డంలో సందేహం అక్క‌ర్లేదు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

తాజా వార్తలు