ఏపీ బీజేపీ నుంచి జంపింగులు అధికంగా ఉండే అవకాశం ఉందా

రాజకీయాల్లో ఎప్పుడూ ఏదీ శాశ్వతం కాదు.ఈ నియమం తెలియకే చాలా మంది ఎగిరెగిరిపడుతుంటారు.

దీని గురించి తెలిసిన వారు అణుకువగా ఉంటూ తమ పని తాము చేసుకు పోతుంటారు.బీజేపీ పార్టీనే తీసుకుంటే 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుని ఉండేది.

కానీ ఆ పార్టీ 2019 ఎన్నికల్లో పొత్తుకు నో చెప్పడంతో దిక్కు తోచని స్థితిలో నేతలు ఉన్నారు.పొత్తు పెట్టుకున్న సందర్భంలో అధికారం తమ వద్ద లేకపోయినా కానీ మంత్రి పదవులన్నా దక్కాయి.

కానీ 2019 నుంచి మాత్రం పార్టీకి ఆ ముచ్చట కూడా లేకుండా పోయింది.ఇదే విషయం గురించి బీజేపీ నేతలు తీవ్రంగా మదనపడుతున్నారు.

Advertisement

ఈ పర్యాయం కూడా పొత్తులు పెట్టుకుందామని యోచిస్తున్నారు.కానీ ఆ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం పొత్తులంటే వద్దని తెగేసి చెబుతున్నారంట.అసలు ఏమైందంటే.2014లో తమకు మంత్రి పదవులను ఆఫర్ చేసిన టీడీపీతో పొత్తు పెట్టుకుందామని ఏపీ బీజేపీ నేతలు చాలా మంది భావిస్తున్నారు.కానీ ఆ విషయంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం అనుకూలంగా లేరనే టాక్ నడుస్తోంది.

చివరి సారి తమను మోసం చేసిన టీడీపీ పార్టీతో జట్టు కట్టేదే లేదని ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

కానీ ఆపార్టీలో ఉన్న చాలా మంది నేతలు టీడీపీ పొత్తును కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.మరి బీజేపీ పార్టీ భవిష్యత్ లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.ఏదేమైనా ఏపీ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ ఇంట్రెస్ట్ నే కలిగిస్తాయి.

చూసే వారికి చూసేంత అన్న రీతిలో ఇప్పుడు ఏపీ రాజకీయాలు సాగుతూ ఉన్నాయి.ఈ పొత్తుల పంచాయతీ ఎటు వైపు వెళ్లనుందో.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు