జర్నలిస్టులపై ఇరిగేషన్ డీఈఈ దురుసు ప్రవర్తన

ఇరిగేషన్ డీఈఈ పిచ్చయ్య( DEE Picchayya )పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డీజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి శ్రీనివాస్,జిల్లా అధ్యక్షుడు కొండగడుపుల ఎల్లయ్య డిమాండ్ చేశారు.

శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డీజేఎఫ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా( Suryapet District ) నాగారం మండలం వర్ధమానుకోట శివారులోని పెద్దిన్ చెరువు నీటిని కాంట్రాక్టర్ చేపలు పట్టేందుకు వృథా చేస్తున్నాడని రైతులు ఫిర్యాదు చేయగా,చెరువు పరిశీలనకు వచ్చిన ఇరిగేషన్ డీఈఈ పిచ్చయ్య,విచారణ పూర్తి కాకుండానే కాంట్రాక్టర్ కు వత్తాసు పలుకుతుండగా, ప్రశ్నించిన విలేకరులపై దురుసుగా ప్రవర్తించి, దూషించడం హేయమైన చర్యన్నారు.సుప్రీంకోర్టు( Supreme Court ) ఆదేశాల మేరకు జర్నలిస్టులపై దూషించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఆరోగ్యానికి వరం బొప్పాయి.‌. కానీ ఇలా తింటే చాలా డేంజర్..!
Advertisement

Latest Suryapet News