వేములవాడ ఏరియా ఆసుపత్రి తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత తదితర అంశాలపై ఆయన ఆసుపత్రిలో తిరిగి పరిశీలించారు.

చికిత్స పొందుతున్న రోగులను వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలపై ఆయన వైద్యాధికారులను అభినందించారు.

Latest Rajanna Sircilla News