డిసెంబర్ 3 తరువాత కొత్త పథకాలు అమలు..: కేటీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ దుబ్బాకలో రోడ్ షో నిర్వహించారు.విద్యుత్ మీద కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కరెంట్ రావడం లేదనే నేతలు కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుందని కేటీఆర్ అన్నారు.రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.

పదకొండు సార్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.అలాగే దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసింది ఏమీ లేదని ఆరోపించారు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న మంత్రి కేటీఆర్ డిసెంబర్ 3 తరువాత కొత్త కొత్త పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement
శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?

తాజా వార్తలు