చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారిందా.. అయితే ఈ నూనె ట్రై చేయండి..!

నల్లగా, పొడుగ్గా, ఒత్తుగా ఉండే జుట్టును( hair ) కలిగి ఉండాలని అందరూ ఆశ పడుతూ ఉంటారు.

అందమైన జుట్టు మన రూపాన్ని అందంగా మార్చడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

జుట్టు రాలడం లేదా పొడిగా కనిపించడం సర్వసాధారణమే.కానీ అది అకాలంగా తెల్ల జుట్టు రావడానికి కూడా కారణం అవుతుంది.

ఒకసారి తెల్ల జుట్టు( white hair ) వచ్చిందంటే చాలు మనిషి మొత్తం రూపాన్ని నాశనం చేస్తుంది.ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఒత్తిడి, సరైన ఆహారం, జుట్టు సంరక్షణ లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల జుట్టు రంగు నెరిసిపోతుంది.అయితే వెంట్రుకలను మళ్లీ నల్లగా మార్చుకోవడానికి హెయిర్ డ్రై, ఇతర కెమికల్ కలిసిన రంగులు వేసుకుంటూ ఉంటారు.

Advertisement

కొన్ని రోజులు నల్లగా ఉన్నప్పటికీ మళ్లీ తెలుపు రంగులోకి మారిపోతుంది.అలా కాకుండా జుట్టును నల్లగా చేసుకోవాలంటే ఆయుర్వేదంలో కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

ఇది ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంకా చెప్పాలంటే జుట్టు నల్లగా ఉండడంలో మెలనిన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

శరీరంలో మెలనిన్( Melanin ) ఉత్పత్తి ఆగిపోతే జుట్టు దాని సహజ రంగును కోల్పోతుంది.దాంతో నల్లని జుట్టు కూడా తెల్లగా మారుతుంది.అయితే సహజంగా జుట్టు నల్లగా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకోవాలి.

ఇది విటమిన్ B9, సింథటిక్ ( Vitamin B9, synthetic )రూపంలో ఉంటుంది.ఇది సప్లిమెంట్ల ద్వారా కూడా తీసుకోవచ్చు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

పాలకూర, ఆవపిండి వంటి ఆకుపచ్చ కూరగాయల ద్వారా కూడా దీన్ని తీసుకోవచ్చు.అలాగే కరివేపాకు ద్వారా జుట్టు నల్లగా మార్చే ఒక టిప్ ని ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

దీనికోసం ఒక ఇనుప పాత్రలో కొబ్బరి నూనె తీసుకొని, అందులో ఎండు ఉసిరి, నల్ల నువ్వులు, కరివేపాకు వేయాలి.

మీకు కావాలనుకుంటే మీరు దీనికి టీ ఆకులను కూడా కలపవచ్చు.ముందుగా గ్యాస్ స్టవ్ మీద పాత్రను పెట్టి అందులో కొబ్బరి నూనె వేయాలి.ఇది గోరువెచ్చగా అయ్యాక అందులో కరివేపాకు, ఎండు ఉసిరి, నల్ల నువ్వులు వేసి వేడి చేయాలి.

వడగట్టిన తర్వాత చల్లారా ఒక వారం పాటు సూర్యరశ్మిలో ఉంచాలి.తర్వాత మాత్రమే అది రాసుకోవడానికి ఉపయోగపడుతుంది.ఈ నూనె వారానికి రెండుసార్లు జట్టుకు పట్టించే అరగంట తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి.

ఈ నూనె రాసుకోవడం వల్ల జుట్టుకు పోషణ లభించడంతో పాటు సహజసిద్ధంగా నలుపు రంగులోకి మారుతుంది.

తాజా వార్తలు