టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Tollywood Hero Junior NTR ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ( Devara Movie )లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే తారక్ కు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
ఎన్టీఆర్ ని దైవ సమానంగా భావించే హీరోలు చాలా మందే ఉన్నారు.అభిమానుల పట్ల ఆ స్టార్ హీరోలు అంతే ప్రేమాభిమానాలతో ఉంటారు.
కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి.ఇండస్ట్రీలో మిగతా హీరోలతో పోల్చుకుంటే ఆయనలో కొన్ని క్వాలిటీలు తారక్ ని అభిమానులకు మరింత దగ్గర చేసాయి.
నటుడిగా తనకంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలతో కొనసాగుతున్నాడు.
![Telugu Devara, Jr Ntr, Ntr, Senior Ntr, Tdp, Tollywood-Movie Telugu Devara, Jr Ntr, Ntr, Senior Ntr, Tdp, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Special-Article-About-Young-Tiger-Junior-NTR.jpg)
అందుకే దేశమే గర్వించదగ్గ రాజమౌళి( Rajamouli ) సైతం అభిమానించే హీరో అయ్యాడు.ఇక వాక్చుతుర్యంలో యంగ్ టైగర్ కి పోటీగా మరో హీరో లేడనే చెప్పాలి.వేదికలపై అంతనంత గొప్పగా ఎవ్వరూ మాట్లాడలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
గుక్క తిప్పకుండా ఉన్న చోటనే ఎలాంటి కదలిక లేకండా అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న నటుడు తారక్ మాత్రమే.ప్రతీ వాక్యంతోనూ ఆకట్టుకోవడం తారక్ లో మరో ప్రత్యేకత అని చెప్పాలి.
అందుకే ఒకానొక సమయంలో టీడీపీ పార్టీ క్యాంపెనెయినర్( TDP Campaigner ) గా మారాడు.అలా తెలుగు తమ్ముళ్లకు తారక్ ఎంతో దగ్గరయ్యాడు.తన వాక్చుతుర్యంతో గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు మేథస్సు అన్ని జూనియర్ రామారావు లో ఉన్నాయని ఆనాడే ప్రశంసలు అందుకున్నాడు.అలా తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు తారక్.
ఇక సమాజం పట్ల అంతే బాధ్యతగా ఉంటూ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.ఇకపోతే అవేర్ నెస్ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో యువతని చైతన్య పరచే ప్రసంగాలు తారక్( Tarak ) ఎదుగుదలకు అదనంగా కలిసొస్తున్నాయి.
![Telugu Devara, Jr Ntr, Ntr, Senior Ntr, Tdp, Tollywood-Movie Telugu Devara, Jr Ntr, Ntr, Senior Ntr, Tdp, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Special-Article-On-Young-Tiger-Junior-NTR.jpg)
ఏమాట మాట్లాడినా ఎలా మాట్లాడినా.మాట్లాడిన ప్రతీ మాట మనసుల్లోతుల్లో నుంచి రావడం ఎన్టీఆర్ కె చెల్లింది.ఇక అభిమానులను ఉద్దేశించి మాట్లాడటంలో అతనంత గొప్ప వక్తగా మరో హీరో లేడు అనడంలో అతిశయోక్తి లేదు.తన సినిమా ఈవెంట్లకు వచ్చిన ప్రతీ అభిమాని ఎంతో జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని మీకోసం మీ తల్లి దండ్రులు అక్చచెల్లెళలు అన్న దమ్ములు ఎదురు చూస్తున్నారని చెప్పడం అతనికే చెల్లింది.
ముందు కుంటుంబం ఆ తర్వాతే మేము మా హీరోలం అంటూ చెప్పడం అతనికే సాధ్యమైంది.