చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారిందా.. అయితే ఈ నూనె ట్రై చేయండి..!

నల్లగా, పొడుగ్గా, ఒత్తుగా ఉండే జుట్టును( hair ) కలిగి ఉండాలని అందరూ ఆశ పడుతూ ఉంటారు.అందమైన జుట్టు మన రూపాన్ని అందంగా మార్చడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

 If Your Hair Has Turned White At A Young Age, Try This Oil , Oil , Hair, White-TeluguStop.com

జుట్టు రాలడం లేదా పొడిగా కనిపించడం సర్వసాధారణమే.కానీ అది అకాలంగా తెల్ల జుట్టు రావడానికి కూడా కారణం అవుతుంది.

ఒకసారి తెల్ల జుట్టు( white hair ) వచ్చిందంటే చాలు మనిషి మొత్తం రూపాన్ని నాశనం చేస్తుంది.ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఒత్తిడి, సరైన ఆహారం, జుట్టు సంరక్షణ లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల జుట్టు రంగు నెరిసిపోతుంది.అయితే వెంట్రుకలను మళ్లీ నల్లగా మార్చుకోవడానికి హెయిర్ డ్రై, ఇతర కెమికల్ కలిసిన రంగులు వేసుకుంటూ ఉంటారు.

కొన్ని రోజులు నల్లగా ఉన్నప్పటికీ మళ్లీ తెలుపు రంగులోకి మారిపోతుంది.అలా కాకుండా జుట్టును నల్లగా చేసుకోవాలంటే ఆయుర్వేదంలో కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.ఇది ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంకా చెప్పాలంటే జుట్టు నల్లగా ఉండడంలో మెలనిన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

Telugu Curry, Dry Amla, Folic Acid, White Young Age, Melanin, Synthetic, Oil, Vi

శరీరంలో మెలనిన్( Melanin ) ఉత్పత్తి ఆగిపోతే జుట్టు దాని సహజ రంగును కోల్పోతుంది.దాంతో నల్లని జుట్టు కూడా తెల్లగా మారుతుంది.అయితే సహజంగా జుట్టు నల్లగా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకోవాలి.ఇది విటమిన్ B9, సింథటిక్ ( Vitamin B9, synthetic )రూపంలో ఉంటుంది.ఇది సప్లిమెంట్ల ద్వారా కూడా తీసుకోవచ్చు.పాలకూర, ఆవపిండి వంటి ఆకుపచ్చ కూరగాయల ద్వారా కూడా దీన్ని తీసుకోవచ్చు.

అలాగే కరివేపాకు ద్వారా జుట్టు నల్లగా మార్చే ఒక టిప్ ని ఇప్పుడు తెలుసుకుందాం.దీనికోసం ఒక ఇనుప పాత్రలో కొబ్బరి నూనె తీసుకొని, అందులో ఎండు ఉసిరి, నల్ల నువ్వులు, కరివేపాకు వేయాలి.

Telugu Curry, Dry Amla, Folic Acid, White Young Age, Melanin, Synthetic, Oil, Vi

మీకు కావాలనుకుంటే మీరు దీనికి టీ ఆకులను కూడా కలపవచ్చు.ముందుగా గ్యాస్ స్టవ్ మీద పాత్రను పెట్టి అందులో కొబ్బరి నూనె వేయాలి.ఇది గోరువెచ్చగా అయ్యాక అందులో కరివేపాకు, ఎండు ఉసిరి, నల్ల నువ్వులు వేసి వేడి చేయాలి.వడగట్టిన తర్వాత చల్లారా ఒక వారం పాటు సూర్యరశ్మిలో ఉంచాలి.

తర్వాత మాత్రమే అది రాసుకోవడానికి ఉపయోగపడుతుంది.ఈ నూనె వారానికి రెండుసార్లు జట్టుకు పట్టించే అరగంట తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి.

ఈ నూనె రాసుకోవడం వల్ల జుట్టుకు పోషణ లభించడంతో పాటు సహజసిద్ధంగా నలుపు రంగులోకి మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube