కార్తీక మాసంలోని పవిత్రమైన ఈ రోజు ఇలా పూజ చేస్తే.. జన్మ జన్మల పుణ్యఫలం లభించడం ఖాయం..?

ముఖ్యంగా చెప్పాలంటే క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి దేవి( Tulasi Devi ) పూజ చేస్తే ఎంతో పుణ్యమని పండితులు చెబుతున్నారు.క్షీరాబ్ది ద్వాదశి( Khseerabdhi Dwadasi ) అంటే ఏమిటి? ఈ రోజున తులసి దేవికి ఎందుకు వివాహం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆషాడ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహా విష్ణువు కార్తీక ఏకాదశి( Karthika Ekadasi ) రోజు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి శుక్ల ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి రోజు ప్రవేశిస్తాడు.

If You Perform This Puja On This Auspicious Day Of The Month Of Kartik It Is Ce

అందుకే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ద్వాదశిన వ్రతాన్ని ఆచరించి తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.కాబట్టి చాలా మంది తులసి దేవిని పెళ్లికూతురుల ముస్తాబు చేసి వివాహ వేడుకల ను జరిపిస్తారు.అలాగే ఇంట్లో అలా కుదరకపోతే తులసి కోట చుట్టూ దీపాలు, పూలు పెట్టి అలంకరించి పూజ చేయాలి.

స్నానం చేసి ఇంట్లో గంగాజలం అందుబాటులో ఉంటే మీ పై చల్లుకొని ఇంట్లో అన్ని ప్రదేశాలలో చల్లాలి.తులసి కొటాను శుభ్రంగా ఉంచుకోవాలి.ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి ఈ రోజే శుభ్రం చేస్తాం అంటే కుదరదు.

If You Perform This Puja On This Auspicious Day Of The Month Of Kartik It Is Ce

ప్రతి రోజు తులసి కోట పరిశుభ్రంగా ఉండడం ఎంతో మంచిది.చేతులు శుభ్రం చేసుకున్నాక తులసీ దళాలను తాకాలి.పూజ మొదలుపెట్టే ముందు తులసి కోట ముందు ముగ్గు వేసి,ఆ ముగ్గు పై నెయ్యితో వెలిగించిన దీపం పెట్టాలి.

Advertisement
If You Perform This Puja On This Auspicious Day Of The Month Of Kartik It Is Ce

పూజా సమయంలో ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకూడదు.అలాగే ఆ రోజున మాంసం, వెల్లుల్లి, ఉల్లి లాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.మంచి ఆరోగ్యం కలవారు ఈ రోజున ఉపవాసం ఉంటే ఎంతో మంచిది అని పండితులు చెబుతున్నారు.

సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు