కాంగ్రెస్ తో మేము పనిచేసే ఉంటే నీకు చిప్పకూడే

మోడీ ( Modi )గారు మీ కమలం నేతలు, కాంగ్రెస్ నేతలు( Congress leaders ) కలిసిపోయి మరి కలిసికట్టుగా పనిచేస్తున్నారు అంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదిక గా చేసిన పోస్టింగ్ పై బీజేపీ ఎంపీ రఘునాథరావు తీవ్రంగా స్పందించారు.

ఈ మేరకు కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

కలిసికట్టుగా మేము కాంగ్రెస్ పార్టీతో పనిచేసి ఉంటే , ఈ రోజు నువ్వు ట్వీట్లు పెట్టకుండా చర్లపల్లి జైల్లో చిప్పకూడు తిని ఉండేవాడివని బిజెపి ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు .

నీ పనికిమాలిన స్టేట్మెంట్లు చూస్తుంటే నువ్వు కోల్పోయింది అధికారం మాత్రమే కాదని,  మెదడు కూడా కోల్పోయామని స్పష్టం అవుతోందని రఘునందన్ రావు ( Raghunandan Rao )విమర్శించారు. కాంగ్రెస్,  బిజెపి( Congress, BJP ) కలిసి పనిచేస్తే కేటీఆర్ ఈ పాటికే జైలు పాలు అయ్యేవాడని , గత పది ఏళ్లు అధికారంలో ఉండి,  అన్ని శాఖల్లో వేలు పెట్టి , తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను,  విద్యావ్యవస్థను , వైద్య వ్యవస్థను కేటీఆర్ చిన్నాభిన్నం చేశారని రఘునందన్ రావు విమర్శించారు.  నీలాంటి వాళ్ళ దగ్గర రాజకీయాలు ఎలా చేయాలో , ఎప్పుడు చేయాలో నేర్చుకునే దౌర్భాగ్యం మాకు పట్టలేదని అన్నారు.

నీకు రాజకీయాలు ఎలా చేయాలో,  ప్రజల సమస్యలు ఎలా నెరవేర్చాలో తెలిసి ఉంటే ఈరోజు అధికారం కోల్పోయి ఉండేవాడివి కాదు .నిన్ను నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించిన మీ నాయన ఈరోజు ప్రజలకు ముఖం చూపించలేక ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యిండు.నీ పనికిమాలిన స్టేట్మెంట్లు చూస్తుంటే నువ్వు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు,  మెదడు కూడా కోల్పోయామని స్పష్టం అవుతోంది అంటూ రఘునందన్ రావు విమర్శలు చేశారు.

Advertisement

కలిసికట్టుగానే పనిచేస్తున్నారు మీ కమలం నేతలు కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరి పని చేస్తున్నారు.చోటే బాయ్ కు వ్యూహకర్తగా, కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా విశ్రమించకుండా పనిచేస్తున్నారు.చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం  చేతి కలుపుతూ చోటే బాయ్ కోసం కలిసి పని చేస్తున్నారు.

ఎన్ని అరాచకాలు జరిగినా ఒకరూ నోరు మెదపరు.రేవంత్ మీద ఈగ వాడకుండా కాపాడుకుంటారు ! హైడ్రా మంచిదంటారు.

మూసి కావాలంటారు.ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు.

పిల్లలు చనిపోయినా,  రైతు గుండె పగిలినా,  గిరిజనులను చెర పట్టినా చప్పట్లు కొడతారు ! తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉంది.! జాగ్రత్తగా! భద్రంగా ! అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ పైనే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు