White Hair : వైట్ హెయిర్ ను మాయం చేసే వెల్లుల్లి పొట్టు.. ఎలా వాడాలో తెలుసా?

ఇటీవల కాలంలో చాలా తక్కువ వయసులోనే ఎంతో మందికి తెల్ల జుట్టు( Grey Hair ) వచ్చేస్తుంది.

పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పోషకాలు కొరత, ఒత్తిడి వంటి అంశాలు తెల్ల జుట్టు రావడానికి ప్రధాన కారణాలు.

ఏదేమైనా తెల్ల జుట్టు అందం తో పాటు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.తెల్ల జుట్టు కారణంగా కొందరు మానసిక ఒత్తిడికి సైతం లోనవుతుంటారు.

ఈ క్రమంలోనే తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు కలర్స్ పై ఆధారపడుతుంటారు.కానీ తరచూ కలర్ వేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.

పైగా కలర్ లో ఉండే కెమికల్స్ ఎన్నో అనారోగ్య సమస్యలను సైతం తెస్తాయి.అందుకే సహజంగానే తెల్ల జుట్టును నివారించుకునేందుకు ప్రయత్నించాలిజ‌ అయితే వెల్లుల్లి పొట్టు వైట్ హెయిర్ ను మాయం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది.

Advertisement

మరి వెల్లుల్లి పొట్టు( Garlic Peel )ను జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని అందులో ఐదు నుంచి ఆరు లవంగాలు( Cloves ), ఆరు బాదం పప్పులు వేసుకుని నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి.ఆ తర్వాత అందులో రెండు కప్పులు వెల్లుల్లి పొట్టు వేసి నల్లగా మారేంతవరకు వేయించాలి.పూర్తిగా బ్లాక్ కలర్ లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పదార్థాలు మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బాల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇండిగో పౌడర్, రెండు టేబుల్ స్పూన్ ఆవ నూనె, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ( వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే తెల్లబ‌డిన‌ జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.వెల్లుల్లి పొట్టు, బాదం, లవంగాలు, ఇడిగో పౌడర్ ఇవన్నీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.

Advertisement

తెల్ల జుట్టుకు వ్యతిరేకంగా పోరాడతాయి.అందువల్ల ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని పాటిస్తే వైయిట్ హెయిర్ స‌మ‌స్య‌( White hair Problem )కు బై బై చెప్ప‌వ‌చ్చు.

ఈ రెమెడీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.పైగా ఈ రెమెడీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగ్గా మారుస్తుంది.

మూలాల నుంచి జుట్టును బలోపేతం చేస్తుంది.హెయిర్ ఫాల్ సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.

మరియు నల్లటి ఒత్తైన కురులు మీ సొంతం అయ్యేలా ప్రోత్సహిస్తుంది.

తాజా వార్తలు