కొన్ని సార్లు ఎంత పెద్ద స్టార్స్ ఉన్న కూడా విడుదల అయ్యాక అంచనాలు తలకిందులవుతూ ఉంటాయి.థియేటర్ లో సినిమా చూడలేని జనాలు ఇంకా అది టీవీ లో టెలికాస్ట్ అయితే మాత్రం ఎందుకు చూస్తారు చెప్పండి.
ఆలా థియేటర్ మరియు టీవీ లో అనేక సినిమాలు ప్లాప్ అవుతూ ఉన్నాయ్.కానీ ఇది అన్ని సందర్భాల్లో కాదు.
థియేటర్ లో కొన్ని కారణాల చేత బోల్తా కొట్టిన సినిమాలు టీవిలో మాత్రం ప్రేక్షకుల మన్నన పొందుతున్నాయి.ఉదాహరణకు ఖలేజా( Khaleza ) సినిమా తీసుకోండి.
త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో ప్లాప్ అయినప్పటికీ టీవీ లో ఇప్పుడు ప్రసారం చేసిన 6 కి తగ్గకుండా రేటింగ్ వస్తూనే ఉంటుంది.
ఇలా ఇప్పుడు టీవీ కి మరొక గొప్ప అవకాశం దొరికింది శ్రీలీల( Sreeleela ) రూపంలో.శ్రీలీల నటించిన ధమాకా సినిమా( Dhamaka Movie ) మినహా మరే ఏ చిత్రం కూడా థియేటర్ లో విజయాన్ని అందుకోలేదు.అందువల్లే ఆమెను ప్రస్తుతం ఐరెన్ లెగ్ తో పోల్చుతున్నారు.
ఆమె నటిస్తే ఇక సినిమా పోయినట్టే అని అనుకుంటూ కొత్త సినిమాలకు తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు.ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా మినహాయించి మరో చిత్రం లేదు.
అయితే ఆమె నటించిన కొన్ని ప్లాప్ సినిమాలు ఇటీవల బుల్లితెరపై బాగా హావ చూపిస్తున్నాయి.
ఆ దోవలో ఆదికేశవ సినిమా( Adikeshava Movie ) ఘోర పరాజయం చవిచూసిన టీవిలో బ్రహ్మాండమైన రేటింగ్ సొంతం చేసుకుంది.అలాగే స్కంద( Skanda ) కూడా అంతే.మంచి వ్యూయర్ షిప్ దక్కించుకొని ఆ హీరోలను ఊపిరి తీసుకునేలా చేసింది.
ఇప్పుడు నితిన్ ఎక్సట్రాడినరీ మూవీ( Extraoridinary Movie ) కూడా టీవీ లో ప్రసారం కాబోతుంది.కేవలం శ్రీలీల కోసమే జనాలు ఈ సినిమాలను ఆదరిస్తున్నారు అని తెలుస్తుంది.
వైష్ణవ తేజ్, రామ్ పోతినేని కి టీవీ లో రేటింగ్ ఇచ్చిన ఈ అమ్మడు నితిన్( Nithiin ) కూడా ఇస్తుందా అనేది వేచి చూస్తే తెలుస్తుంది.