ఆంజనేయుడినొక్కడినే కాదు రాముడిని కొలవాలి..!

హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే. ఆ భక్తులు శ్రీరాముడి భక్తులు కూడా అయ్యుండాలని పురాణాలు చెబుతున్న మాట.

ఎందుకంటే.ఎక్కడైతే రామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడనీ, తన రామయ్య పట్ల భక్తిశ్రద్ధలు కలిగిన వారిని చూసి హనుమంతుడు కూడా మురిసిపోతాడని రామాయణ గ్రంథాలు చెబుతున్నాయి.

అందుకే ఆ శ్రీరాముడితో కలిపి హనుమంతుడిని పూజిస్తే కోరుకున్న కోరికలు, మొక్కులు తప్పక నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.మంగళవారం, శనివారం హనుమంతుడికి ప్రదక్షిణలు చేసి సిందూరంతో అభిషేకం, ఆకుపూజ చేస్తే సత్ఫలితాలు కనిపిస్తాయి.

హనుమంతుడికి వడలు, తీపి పిండివంటలు నైవేద్యంగా సమర్పించాలి.వీలైతే హనుమాన్ జయంతి నాడు ఈ విధంగా పూజ చేయగలిగితే మరింత మంచిది అని వేదాలు తెలిసిన బ్రాహ్మణులు చెబుతుంటారు.

Advertisement

మంగళవారం, శనివారాల్లో సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా చదవడం, హనుమాన్ నామ సంకీర్తనం చేసిన వారికి హనుమంతుడు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో తులతూగేలా అనుగ్రహిస్తాడని వేదాలు చెబుతున్నాయి.

ఆంజనేయు స్వామిని ఎలా ప్రార్థించాలి?

శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి.అలాగే ఆంజనేయ స్వామికి "శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

హనుమాన్ జయంతి రోజున సాయంకాలం సూర్య స్తమయం తర్వాత ఆరు గంటల ప్రాంతంలో ఆంజనేయుని ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించడానికి ముందు హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించాలి.మరో కథనం ప్రకారం.

అశోక వనంలో ఉన్న సీతమ్మ దేవికి, ఆంజనేయుడు రాముల వారి సందేశం చెప్పే సమయంలో ఆ జానకి దేవి ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట.(ఆ సమయంలో పువ్వులు కనిపించకపోవడంతో) అందుకే స్వామి వారికి తమలపాకుల దండ అంటే చాలా ఇష్టమని చెబుతుంటారు.

బట్టల మీద ఎలాంటి మరక పడిన ఈ విధంగా చేస్తే మళ్ళి కొత్త వాటిలాగా మెరుస్తాయి
Advertisement

తాజా వార్తలు