రామ్ చరణ్ ఆస్తులు ఎన్ని కోట్లు? అప్పులు ఎన్ని కోట్లు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మెగా వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తేజ్ చిరుత వేగంతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత మగధీర సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ అపోలో అధినేత మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ విషయం అందరికీ తెలిసిందే.రామ్ చరణ్ ను ఉపాసన పెళ్లి చేసుకున్నప్పుడు కట్నకానుకల కింద అతనికి భారీ మొత్తంలోనే తీసుకు వచ్చిందని సమాచారం.

ఇలా ఇండస్ట్రీలో హీరోగా రామ్ చరణ్ మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు.

How Many Crores Is Ram Charan Assets How Many Crores Of Debt Details, Ram Chara
Advertisement
How Many Crores Is Ram Charan Assets How Many Crores Of Debt Details, Ram Chara

ఒక వైపు నిర్మాతగా, మరొకవైపు హీరోగా, అలాగే తన భార్య ఉపాసన అపోలో హాస్పిటల్ ఛైర్ పర్సన్ గా విధులు నిర్వహిస్తూ రామ్ చరణ్ భారీ మొత్తంలోనే ఆస్తులను పోగు చేసినట్లు తెలుస్తోంది.ఇలా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించారని సమాచారం.ఒక మీడియా నివేదికల ప్రకారం రామ్ చరణ్ మార్చి 2021 సంవత్సరానికి ఆయన ఆస్తులు సుమారు 1500 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.అదేవిధంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాల్లో కూడా నటించారు.

How Many Crores Is Ram Charan Assets How Many Crores Of Debt Details, Ram Chara

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఆస్తి మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.అదేవిధంగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ RC15  సినిమాలో నటిస్తున్నారు.

ఇదే కాకుండా మరి కొన్ని సినిమాలకు కూడా రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇలా ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి మెగా వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు.

నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?
Advertisement

తాజా వార్తలు