మైనార్టీల విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిఎం కేసిఆర్( CM KCR ) నాయకత్వంలోనీతెలంగాణ ప్రభుత్వం మైనార్టీల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ( B Vinod Kumar )అన్నారు.

ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని మైనార్టీ లబ్ధిదారులకు ఆర్థిక సహాయ పథకం కింద 120 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.

లక్ష చొప్పున ఒక కోటి 20 లక్షల రూపాయలను అందజేశారు.అలాగే పేద మైనార్టీ మహిళలకు 425 మందికి ఒక్కొక్కరికి పదివేల విలువగల 425 కుట్టుమిషన్లను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.తెలంగాణ వచ్చాక సిఎం కేసిఆర్ మైనార్టీల కోసం పెద్ద ఎత్తున గురుకులాలు స్థాపించారనీ చెప్పారు.

నియోజకవర్గానికి ఒక్క మైనారిటీ గురుకులం పెట్టారన్నారు.మైనార్టీ బాలబాలికలకు ఐదు నుంచి డిగ్రీ వరకు గురుకులాల ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు.

Advertisement

ఇందు కోసం ఏటా ఒక్కో విద్యార్థి పై ప్రభుత్వం ఒక లక్షా 20 వేలను ఖర్చు చేస్తుందన్నారు.అన్ని సదుపాయాలతో కూడిన మైనార్టీ గురుకులాల్లో చదివే బాల బాలికలకు మంచి విద్యా బోధన ఉందన్నారు.

ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారని తెలిపారు.ఎస్సీ, ఎస్టీ ,బిసి గురుకులాలలో సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండగా మైనార్టీ గురుకులాలకు తమ పిల్లలను పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు.

ఫలితంగా కొన్ని మైనారిటీ గురుకులాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.మైనార్టీలు చదువు ప్రాధాన్యతను గుర్తించి తమ పిల్లలను ముఖ్యంగా బాలికలను గురుకులాల్లో చేర్పించాలన్నారు.

ప్రజా ప్రతినిధులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మైనార్టీ గురుకులాలు అన్ని సీట్లు భర్తీ అయ్యేలా చూడాలన్నారు.స్వ రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధి సంక్షేమం కు కృషి చేస్తుందన్నారు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 3 కళాశాలలు మాత్రమే ఉండగా 350 మెడికల్స్ సీట్లు మాత్రమే ఉండేవన్నారు.ప్రస్తుతం తెలంగాణలో 60 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు ఫలితంగా ప్రతి ఏడ తెలంగాణ ప్రభుత్వం పదివేల మంది డాక్టర్లను తయారు చేస్తుందన్నారు.

Advertisement

సిరిసిల్లలో మంత్రి కే టి ఆర్ ( Minister KTR )ప్రత్యేక చొరవ తో ఏర్పాటైన ఆపెరల్ పార్కులో జీన్స్, టీ షర్టులు తయారవుతున్నాయన్నారు.కుట్టు శిక్షణ తీసుకొని, కుట్టుమిషన్లు పొందిన మైనార్టీ మహిళలు అపెరల్ పార్క్ లో ఉపాధి పొందేందుకు వీలుగా పుట్టులో మంచి తర్ఫీదు పొందాలన్నారు.

అలాగే జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు.

ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సహాయంను సద్వినియోగం చేసుకొని మైనార్టీలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,టేస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య , జెడ్పీటీసీ మంజుల, ఎంపీపీ మానస, మైనార్టీ శాఖ ఓ ఎస్ డి సర్వర్ మియా,స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News