రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు ఏర్పడుతున్నాయి.ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ కోర్టు స్పష్టం చేయగా తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ( Gadwala Mla Krishna mohan reddy ) ఎన్నిక కూడా చెల్లదంటూ హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే డీకే అరుణ ( Dk .Aruna ) అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.అసలేం జరిగిందో చూద్దాం.ఎన్నికల అఫిడవిటీ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని దాని కారణంగానే కోర్టు విచారణ చేపట్టి ఆయనను డిస్ క్వాలిఫై చేసింది.
అయితే గద్వాల స్థానంలో బిజెపి నాయకురాలు డీకే అరుణ రెండో స్థానంలో ఉండగా ప్రస్తుతం ఆమెని ఎమ్మెల్యేగా ప్రకటించింది హై కోర్ట్.
అంతేకాకుండా కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల జరిమానా కూడా విధించింది.అంతేకాకుండా డీకే అరుణకు 50 వేల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇదే తరుణంలో హైకోర్టు తీర్పును కృష్ణమోహన్ రెడ్డి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.
ఈ మధ్యకాలంలో తెలంగాణ హైకోర్టు ( Telangana high court ) వరుసగా కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యేల లిస్ట్ లను పరిశీలిస్తోంది.
విచారణ చేపట్టి ఈ నెలాఖరులోగా ఆదేశాలు జారీ చేయాలనే నేపథ్యంలో మంత్రులైనటువంటి గంగుల, కొప్పుల ఇంకో 25 మంది ఎమ్మెల్యేల లిస్ట్ ను పరిశీలన చేస్తున్నారట.ఇప్పటికే అనర్హత కేసుల్లో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, చెన్నమనేని రమేష్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గొంగిడి సునీత, ఆర్.రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే రాజాసింగ్ ( Raja singh ) ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల పిటిషన్లు కోర్టులో పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.