పవన్ కళ్యాణ్ కోసం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా చేసిన ఏకైక హీరోయిన్ ఆమేనా?

స్టార్ హీరోయిన్లు రెమ్యూనరేషన్( Remuneration ) విషయం లో ఎంత డిమాండ్ గా ఉంటారో మన అందరికీ తెలిసిందే.

చిన్న బడ్జెట్ అయినా, పెద్ద బడ్జెట్ సినిమా అయిన వాళ్ళు కోరినంత డబ్బులు ఇవ్వాల్సిందే.

కేవలం డబ్బులు మాత్రమే కాదు, హీరోయిన్స్ ( Heroines ) ఉండే హోటల్, ఆమె స్టాఫ్ కి అయ్యే ఖర్చులు, కొనుక్కునే వస్తువుల దగ్గర నుండి అన్నీ నిర్మాతలే కట్టాలి.ఇక ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే సదరు షాపింగ్ మాల్ ఓనర్ ఆస్తులు అడిగేస్తారు.

ఈ రేంజ్ డిమాండ్ ఉంటుంది హీరోయిన్స్ నుండి.హీరోలు అయినా అప్పుడప్పుడు కొంతమంది నిర్మాతల మీద గౌరవం, అభిమానం తో ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా సినిమాలు చేస్తుంటారు.

కానీ హీరోయిన్స్ మాత్రం అలా చెయ్యరు.అలా సౌత్ లో కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే ఒక హీరోయిన్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా కోసం రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నటించిందట.

Advertisement
Heroine Shriya Saran Did Not Take Remuneration For Pawan Kalyan Movie Details, H

ఆ హీరోయిన్ మరెవరో కాదు, శ్రీయా శరన్.( Shriya Saran ) ఈమె పవన్ కళ్యాణ్ తో కలిసి రెండు సినిమాల్లో నటించింది.

మొదటి సినిమా బాలు( Balu Movie ) కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు కానీ, వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం ఆన్ స్క్రీన్ లో అదిరిపోయింది.

Heroine Shriya Saran Did Not Take Remuneration For Pawan Kalyan Movie Details, H

ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం కొమరం పులి.( Komaram Puli ) ఇందులో ఆమె కేవలం ఒక ఐటెం సాంగ్ లో కనిపిస్తుంది.ఆ తర్వాత రెండు సీన్స్ లో కనిపిస్తుంది.

అప్పటికే సౌత్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రీయా, పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఐటెం సాంగ్ చెయ్యడానికి ఒప్పేసుకుందట.అంటే కాదు ఆయన మీద అభిమానం తో ఈ సినిమాలో చేసినందుకు గాను ఆమె ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ఛార్జ్ చేయలేదట.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఈ వార్త అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది.అప్పట్లో ఆమె ఒక్క రోజు కాల్ షీట్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు.

Advertisement

అలాంటి డిమాండ్ ఉన్న రోజుల్లో ఒక్క రూపాయికూడా తీసుకోకుండా విలువైన డేట్స్ ని ఇవ్వడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఒకప్పుడు హీరోయిన్ గా పాన్ ఇండియా ని ఏలిన శ్రీయా శరన్, ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో మెరుస్తుంది.అయితే గత ఏడాది వరకు దూకుడుగా సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీయ శరన్, ఈ ఏడాది సైలెంట్ అయిపోయింది.

ఈమె చివరి సరిగా మన తెలుగు తెరపై కనిపించిన చిత్రం #RRR. ఇందులో ఆమె రామ్ చరణ్ కి తల్లిగా నటించింది.

తాజా వార్తలు