అల్లు అర్జున్ కంటే గొప్పగా ఎవరూ నటించలేరు.. పూనమ్ కౌర్ ఆసక్తికర పోస్ట్ వైరల్!

సంధ్య థియేటర్ వివాదం విషయంలో అల్లు అర్జున్( Allu Arjun ) చుట్టూ ఉచ్చు బిగుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సమస్య పరిష్కారం దిశగా బన్నీ అడుగులు వేస్తున్నా బన్నీకి సానుకూల ఫలితాలు రావడం లేదు.

మరోవైపు ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే పోస్టులు చేయొద్దని బన్నీ సూచనలు చేశారు.ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ప్రొఫైల్స్ తో పోస్టులు చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోబడతాయని బన్నీ చెప్పుకొచ్చారు.

నెగిటివ్ పోస్టులు చేస్తున్న వాళ్లకు ఫ్యాన్స్ దూరంగా ఉండాలని బన్నీ కామెంట్లు చేశారు.మరోవైపు ప్రముఖ నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) పుష్ప2( Pushpa 2 ) సినిమా గురించి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

మొత్తానికి పుష్ప ది రూల్ సినిమా చూశానని తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలాగో గంగమ్మ జాతరను అంత బాగా చూపించారని ఆమె చెప్పుకొచ్చారు.ఈ సినిమాలో మన ఆచార సంస్కృతి సాంప్రదాయాలను బాగా చూపించారని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.

Heroine Poonam Kaur Interesting Post About Allu Arjun Details, Allu Arjun, Pushp
Advertisement
Heroine Poonam Kaur Interesting Post About Allu Arjun Details, Allu Arjun, Pushp

పుష్ప2 సినిమాలో బన్నీ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరని ఆమె కామెంట్లు చేశారు.మరోవైపు పుష్ప ది రూల్( Pushpa The Rule ) థర్డ్ వీకెండ్ లో సైతం కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.ఇప్పటికే ఈ సినిమాకు 1600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి.పుష్ప ది రూల్ సంక్రాంతి వరకు కలెక్షన్ల విషయంలో అదరగొట్టనుంది.పుష్ప2 మూవీ సాధిస్తున్న రికార్డ్స్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.

Heroine Poonam Kaur Interesting Post About Allu Arjun Details, Allu Arjun, Pushp

బన్నీ తర్వాత సినిమా షూటింగ్ లో ఎప్పటినుంచి పాల్గొంటారో అనే చర్చ సైతం జరుగుతోంది.బన్నీ తర్వాత సినిమాలకు సైతం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు