రజినీకాంత్ కూలీ సినిమాలో కనిపించనున్న స్టార్ హీరో...

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో రజనీకాంత్( Hero Rajinikanth ) ఆయన మించిన మరొక హీరో ఇండస్ట్రీలో లేడు అని చెప్పదం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుందనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్( Director Lokesh Kanagaraj ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

అంటే ఈ సినిమాతో రజనీకాంత్ ఏ మేరకు తన సత్తాను చాటుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్( Coolie Teaser ) అద్భుతమైన రెస్పాన్స్ ని సంపాదించుకుంది.అయినప్పటికీ ఈ సినిమా లోకేష్ కనకరాజ్ స్టాండర్డ్ లో భారీ సక్సెస్ ని కొడుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే లోకేష్ గత చిత్రమైన లియో( Leo ) అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేదు.

Advertisement

ఇక దాని ప్రభావం ఈ సినిమా మీద కొంతవరకైనా ఉంటుంది అని ట్రెడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కనక లోకేష్ సూపర్ సక్సెస్ కొడితే ఆయన రేంజ్ మరింత పెరుగుతుంది.అయితే ఈ సినిమాలో తెలుగులో స్టార్ హీరో గా గుర్తింపు పొందిన వెంకటేష్( Hero Venkatesh ) కూడా గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త అయితే గత రెండు మూడు రోజుల నుంచి చక్కర్లు కొడుతుందనే చెప్పాలి.చూడాలి మరి ఈ సినిమాతో రజినీకాంత్ ఎలాంటి స్క్సెస్ అందుకుంటాడు అనేది.

Advertisement

తాజా వార్తలు