డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా రావణాసుర.( Ravanasura ) ఇందులో మాస్ మహారాజ్ రవితేజ( Ravi Teja ) హీరోగా నటించాడు.
అంతేకాకుండా సుశాంత్, మేఘ ఆకాష్, అను ఇమ్మానుయేల్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, జయరాం, సంపత్ రాజ్, రావు రమేష్, మురళీ శర్మ, హైపర్ ఆది, సత్య తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు రవితేజ, అభిషేక్ నామ నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.
హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, లుక్స్ ప్రేక్షకులను బాగా ఫిదా చేశాయి.
అంతేకాకుండా భారీ అంచనాలు కూడా పెంచాయి.ఇక ఈరోజు ఈ సినిమా థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.అంతేకాకుండా ఈమధ్య వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న రవితేజకు ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ఇందులో రవితేజ ఫరియా అబ్దుల్లా అనే సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా పని చేస్తూ ఉంటాడు.ఇక మేఘ ఆకాష్( Megha Akash ) తన తండ్రి సంపత్ రాజ్ మీద పడిన మర్డర్ కేసు పై విచారణ జరిపి అసలు నిజం తెలుసుకుంటుంది.
దీంతో తన తండ్రిని విడిపించేందుకు రవితేజ, ఫరియా అబ్దుల్లాలను కోరుతుంది.ఆ తర్వాత వరుస మర్డర్లు జరుగుతూ ఉంటాయి.దీంతో ఆ మర్డర్లు చేస్తుంది రవితేజ అని బయటపడుతుంది.అయితే రవితేజ ఎందుకు మర్డర్లు చేస్తున్నాడు అని.అసలు ఆయన అలా మారటానికి కారణం ఏంటి.చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
మాస్ మహారాజ్ రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మాస్ సినిమాలకే కాకుండా క్లాస్ సినిమాలకు కూడా అద్భుతమైన నటనను అందిస్తాడు.ఇక ఈ సినిమాలో తన పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు.సీరియస్ లుక్ లో, సన్నివేశాలలో బాగా అదరగొట్టాడు.ఇక హీరోయిన్ మేఘ ఆకాష్ కూడా బాగానే నటించింది.లాయర్ పాత్రలో ఫరియా అద్భుతంగా చేసింది.
ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
ఈ సినిమాకు డైరెక్టర్ మంచి కథను అందించాడు.పాత్రలకు తగ్గట్టుగా నటులను ఎంచుకున్నాడు.అంతేకాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే థ్రిల్లింగ్ అనుభూతి కూడా అందించాడు.
సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.సంగీతం కూడా బాగా ఆకట్టుకుంది.మిగతా టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
విశ్లేషణ:
ఇక ఈ సినిమా ప్రారంభంలోనే మంచి ఎంటర్టైన్మెంట్ గా సాగుతుంది.ఆ తర్వాత మర్డర్ సన్నివేశాలతో బాగా ఇంట్రెస్ట్ చూపించాడు డైరెక్టర్.ఆ తర్వాత ఏం జరుగుతుందన్న సస్పెన్స్ కూడా బాగుంది.మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు మాత్రం హైలెట్ అని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కథ, సంగీతం, ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ కాన్సెప్ట్.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు ఊహించి తగ్గట్టుగా ఉన్నాయి.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్పొచ్చు.రవితేజ కాబట్టి అతని మాస్ తనం కే ఫిదా అవుతారు.ఇక ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో చాలా కొత్తగా కనిపించాడు.మొత్తానికి నెగటివ్ షేడ్స్ తో అదరగొట్టాడు రవితేజ.