భారీగా నల్ల బెల్లం పట్టివేత

సూర్యాపేట జిల్లా:విజయవాడ నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం,పటికను శుక్రవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద పట్టుకున్నారు.

విజయవాడ నుంచి సూర్యాపేటకు నల్లబెల్లం తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించగా సూర్యాపేటకు చెందిన లింగయ్య బొలెరో వాహనంలో 1200 కిలోల నల్ల బెల్లంతో పాటు 100 కిలోల పటికను తరలిస్తుండగా పట్టుబడ్డాడని, బెల్లం,పటికతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

Latest Suryapet News