Director teja suman shetty : డైరెక్టర్ తేజ కోసం తన ఇంట్లో ఒక గది కట్టిన నటుడు ఎవరో తెలుసా ?

సినిమా ఇండస్ట్రీకి రకరకాల విభాగాల కోసం వెయ్యికి పైగా వ్యక్తులను పరిచయం చేసిన ఘనత కేవలం దర్శకుడు తేజకి మాత్రమే సొంతం.ఆయన ద్వారా చాలా మంది హీరోలుగా, హీరోయిన్స్ గా, టెక్నీషియన్స్ గా, కమెడియన్స్ గా, రకరకాల శాఖల్లో ఎంతో మంది పని చేస్తున్నారు.

 Director Teja About Comedian Suman Shetty ,suman Shetty, Jayam Movie, Nithin, Di-TeluguStop.com

ప్రస్తుతం అయితే ఆయన సినిమాలు తీయడం లేదు.కానీ తీస్తే మాత్రం పక్కాగా కొత్తవారిని పెట్టుకొని పని చేస్తాడు.

ఎంత స్టార్ కాస్ట్ ఉన్నప్పటికి కొత్తవారిని పరిచయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి.ఆయన సినిమాల ద్వారా, ఉదయ్ కిరణ్, కాజల్, ఆది పినిశెట్టి వంటి ఎంతో మంది స్టార్స్ ఇండస్ట్రీ కి వచ్చారు.

ఇక ఇటీవల ఆయన ఒక మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో యాంకర్ తేజను సదరు యాంకర్ ఈ విధంగా ప్రశ్నించారు.మీరు ఇన్ని వందల మందిని తెలుగు తెరకు పరిచయం చేశారు కదా వారిలో ఎవరైనా మీపై మంచి గ్రాటిట్యూడ్ తో ఉన్నారా ? అంటే అందుకు ఆయన నుంచి నవ్వే సమాధానంగా వచ్చింది.నేను పని చేసిన వారిలో నా గురించి ఎవరైనా నన్ను ఎందుకు గుర్తు పెట్టుకోవాలి.నేను పరిచయం చేశాను అంటే అది నాకు పెద్ద విషయమేమీ కాదు కానీ అలాంటి వారు నన్ను గుర్తుపెట్టుకుంటారని మాత్రం నేను అనుకోవడం లేదు.

కానీ అందరిలో కి మాత్రం ఒక కమెడియన్ మాత్రం ఖచ్చితంగా తనను గుర్తు చేసుకుంటాడు అని చెప్పకచ్చాడు.

Telugu Teja, Jayam, Nithin, Suman Shetty, Tollywood-Latest News - Telugu

ఆ కమెడియన్ మరెవరో కాదు సుమన్ శెట్టిఅతడిని డైరెక్టర్ తేజ జయం సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో ఆయనకు మంచి పేరు వచ్చింది.ఆ తర్వాత ఒకరోజు తేజ దగ్గరికి వెళ్లిన సుమన్ శెట్టి మీ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని, ఇల్లు కట్టుకుంటున్న అంటూ తేజ కాళ్లకు నమస్కరించబోయాడట.కానీ అందుకు తేజ అడ్డు చెప్పి నా కాళ్లకు నమస్కరించాల్సిన అవసరం లేదు కానీ నీలాంటి కొత్తవారిని ఎంతోమందిని తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఏదో ఒక రోజు నేను రోడ్డు పైకి రావడం మాత్రం ఖాయం.

అందుకే నువ్వు కడుతున్న ఇంటిలో నాకు ఒక రూమ్ తీసి పెట్టు నేను రోడ్డు మీద పడ్డాక ఎక్కడికి వెళ్లాలో తెలియక నీ ఇంటికి తప్పకుండా వస్తాను అని చెప్పారట.తేజ చెప్పినట్టుగానే సుమన్ శెట్టి సైతం తేజ గారి కోసం తన ఇంట్లో ఒక గదిని కట్టి పెట్టాడట ఇప్పటికి ప్రతిరోజు ఆ గదిని శుభ్రం చేస్తూనే ఉంటాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube