ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) విచారణ జరిగింది.

తన చిన్న కుమారుడి పరీక్షల నిమిత్తం కవిత మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.

ఈ క్రమంలో కవిత తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.ఏప్రిల్ 16 వరకు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని చెప్పారు.

తన కుమారుడికి కవిత మద్ధతుగా ఉండేందుకు బెయిల్ ఇవ్వాలన్న న్యాయవాది సింఘ్వి కవిత అరెస్టుతో కుమారుడు మానసికంగా కుంగిపోయారని తెలిపారు.ఈ క్రమంలో పరీక్షలకు గైర్హాజరు అయ్యే అవకాశం ఉందన్నారు.

పరీక్షల సందర్భంగా తల్లి మద్ధతు పిల్లలకు అవసరమని ఆయన కోర్టుకు తెలిపారు.

Advertisement

షరతులతో కూడిన బెయిల్ కు తమకు అభ్యంతరం లేదని సింఘ్వి పేర్కొన్నారు.మరోవైపు ఎమ్మెల్సీ కవితకు బెయిల్( MLC Kavitha Bail ) ఇవ్వొద్దని ఈడీ వాదనలు వినిపించింది.అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదన్న ఈడీ తరపు న్యాయవాది కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

కవిత సెల్ ఫోన్లను మార్చారని, సమాచారాన్ని డిలీట్ చేశారని పేర్కొన్నారు.లిక్కర్ వ్యాపారంలో కవితకు 33 శాతం వాటా ఉందని ఈడీ చెప్పింది.ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో( Liquor Case ) కవిత పాత్రప దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది.

ఇటువంటి సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం కేసు విచారణకు ఆటంకమని వెల్లడించింది.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు