ఆసియా అమెరికన్లో తక్కువ పేదరికం రేటు భారతీయులదే.. వెలుగులోకి ఆసక్తికర సర్వే

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన ఆసియా మూలాలున్న ప్రజలు అక్కడి అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.పొట్ట చేత పట్టుకుని వెళ్లిన వారు ఆదాయంలో స్థానికుల్నే అధిగమిస్తున్నారు.

 Indian-americans Have Lowest Poverty Rate Among Asian Americans , Asian America-TeluguStop.com

కానీ ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.‘‘ ప్యూ రీసెర్చ్ సెంటర్ ’’ ( Pew Research Center )అధ్యయనం ప్రకారం.2022లో అమెరికాలో నివసిస్తున్న ఆసియా మూలాలు కలిగిన 2.3 మిలియన్ల మంది ప్రజలు పేదరికంలో వున్నారట. యూఎస్ సెన్సస్ బ్యూరో ( US Census Bureau )నుంచి వచ్చిన డేటా విశ్లేషణ ప్రకారం ప్రతి పది మంది ఆసియా అమెరికన్లలో ఒకరు పేదరికంలో నివసిస్తున్నారు.అయితే ఇతర ఏషియన్ అమెరికన్ గ్రూపులతో పోలిస్తే ఇండో అమెరికన్లు మెరుగ్గా రాణిస్తున్నట్లు సర్వే తెలిపింది.

భారతీయ అమెరికన్లలో పేదరికం రేటు 6 శాతం.ఇది అమెరికాలో నివసిస్తున్న ఇతర ఆసియా సమూహాల కంటే తక్కువ.

Telugu Asian Americans, Indianamericans, Los Angeles, York, Pew Research, San Fr

బర్మీస్ 19 శాతం, హమాంగ్ అమెరికన్లు 17 శాతం పేదరికాన్ని అనుభవిస్తున్నారు.ప్యూ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం 25 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న ప్రతి ముగ్గురు ఆసియా అమెరికన్లలో ఒకరు బ్యాచిలర్ డిగ్రీని కలిగి వున్నారని తెలిపింది.పోల్చి చూస్తే .పేదరికంలో వున్న ఆసియన్లు కానీ వారిలో కేవలం 14 శాతం మంది మాత్రమే ఒకే స్థాయి విద్యను కలిగి వున్నారు.ఆసక్తికరంగా , కనీసం బ్యాచిలర్ డిగ్రీని కలిగి వున్న 25 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న ఆసియా అమెరికన్లు తక్కువ స్థాయి విద్య (13 శాతం) వున్న వారితో పోలిస్తే పేదరికంలో (5 శాతం) జీవించే అవకాశం తక్కువ.

Telugu Asian Americans, Indianamericans, Los Angeles, York, Pew Research, San Fr

దాదాపు పది మందిలో ఆరుగురు .పేదరికంలో వున్న ఆసియా అమెరికన్లలో ఎక్కువ మంది వలసదారులే.వీరిలో చాలా మంది ఇంగ్లీష్ బాగా మాట్లాడలేరు.

దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న ఆసియా వలసదారులలో కేవలం 44 శాతం మంది మాత్రమే ఇంగ్లీష్‌లో నైపుణ్యం కలిగి వున్నారు.దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న సుమారు 1 మిలియన్ ఆసియన్లు యూఎస్‌లోని 10 పెద్ద నగరాల్లో వున్నారు.

ఆశ్చర్యకరంగా వాటిలో సగం మిలియన్లకు పైగా కేవలం మూడు నగరాల్లోనే వున్నారు.అవి న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube