కింద కూర్చొని తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

మన భారతీయ సంస్కృతి( Indain Culture )లో నేలపై కూర్చుని తినడం అన్నది చాలా ముఖ్యమైన భాగం.

దీనివలన కలిగే లాభాలు చాలామంది ఈ మధ్యకాలంలో మర్చిపోయారు.

గతంలో ఏ సమయంలోనైనా కింద కూర్చోనేవారు.అలాగే ప్రార్థన స్థలంలో లేదా భోజనం కోసం అంతేకాకుండా ఇతర సమయాల్లో కూడా కింద కూర్చునే వారు.

ఇలా కింద కూర్చోవడం వెనుక సైన్స్ కూడా ఉంది.ముఖ్యంగా ఇలా కూర్చోవడం జీర్ణక్రియ( Digestion )తో ముడిపడి ఉంటుంది.

భోజనం చేయడానికి సుఖాసనంలో కూర్చోవడం యోగ చేయడానికి ఒక మార్గం అని ఆయుర్వేదం చెబుతోంది.అంతేకాకుండా ఇలా చేయడం వలన కలిగి ఉన్న ప్రయోజనాలు ఉన్నాయి.

Advertisement

అందుకే మీరు తినడానికి సోఫాలో, డైనింగ్ టేబుల్ ల పై కాకుండా కూర్చొని తింటే( Sitting on Floor ) మంచిది.నేలపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది.అంతేకాకుండా శరీర భంగిమలు సరిచేసి రక్తాన్ని పంప్ చేసి శరీరం అంతా ప్రసదింపజేస్తుంది.

అయితే కింద కూర్చోవడం ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.సుఖాసనంలో కూర్చోవడం పాదాలకు రక్త ప్రసరణ( Blood Circulation )ను తగ్గిస్తుంది.

మెరుగైన జీర్ణ క్రియ కోసం వారి కార్యకలాపాలను పెంచడానికి గుండె, కాలేయం లాంటి ఇతర శరీర భాగాలకు మల్లుతుంది.అయితే డైనింగ్ పై కూర్చోడం వలన కేవలం పాదాలకు మాత్రమే కేంద్రీకరిస్తుంది.

సుఖాసనంలో కూర్చోవడం వలన జీర్ణ క్రియకు ప్రయోజనం చేకూర్తుంది.ఇక ఇది జీర్ణరసాలను స్రవించడానికి, శరీరాన్ని సరైన భావనలో అది ఉంచడానికి సహాయపడుతుంది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరం సిద్ధంగా ఉందని మెదడుకు సంకేతాలను పంపిస్తుంది.అతిగా తినడం వలన అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, బరువు పెరగడం( Weight Gain ) లాంటి సమస్యలు వస్తాయి.అందుకే బరువు తగ్గడానికి అలాగే వేగవంతం చేయడానికి కింద కూర్చోవడం సహాయపడుతుంది.

Advertisement

కాళ్లకు అడ్డంగా కూర్చోడం వలన వెన్నుముక, ఛాతీ, చీలమండలు, తుంటి, మోకాళ్ళకు బలం వస్తుంది.ఇక మరింత సరళంగా మారడంలో కూడా సహాయపడుతుంది.ఇక మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఇలా ఎక్కువగా కూర్చోవడం వలన ఉపశమనం లభిస్తుంది.

సుఖాసనం లో కూర్చోవడం వలన మన పూర్వీకులకు ఇలాంటి సమస్యలు ఉండేవి కావు.

తాజా వార్తలు