సైకిల్ ను బైక్ ల మార్చేశాడు.. వీడియో చూసి అవాక్కైనా నెటిజన్స్..!

సోషల్ మీడియా వేదికగా మనిషి తన ప్రతిభను ప్రపంచానికి చూపిస్తూ ఆశ్చర్య పరుస్తూనే ఉన్నాడు.

ప్రతిరోజు కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ చూసే వారందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

కొందరు వ్యక్తులు చేసే ఆవిష్కరణలు చూసి ఇంజనీర్లు, సైంటిస్టులు( Engineers , scientists ) సైతం ఫిదా అవుతున్నారు.సాధారణ వ్యక్తులు కూడా మెదడుకు పదును పెడితే అద్భుతాలు సృష్టించవచ్చు అనేదానికి ఈ ఘటనే నిదర్శనం.

ఒక వ్యక్తి సైకిల్( cycle ) కు మోటార్ సైకిల్ ఇంజన్ బిగించి మోటార్ సైకిల్ లాగా వాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ సైకిల్ కు బైక్ ఇంజన్.

తో పాటు పొగ బయటకు వెళ్లడానికి ఎగ్జాస్ట్ పైప్ ఏర్పాటు చేశాడు.ఇది పెట్రోల్ సహాయంతో నడుస్తుంది.

Advertisement

సైకిల్ ను తొక్కకుండా బైక్ లాగా స్టార్ట్ చేసి నడపవచ్చు.

సైకిల్ ను తొక్కుకుంటూ చాలా దూరం వెళ్లడం అంత ఈజీ కాదు.పైగా వయసు పైబడిన వారు సైకిల్ తొక్కడం చాలా కష్టం.కాబట్టి సైకిల్ ను బైక్ లాగా మార్చేసి, స్టార్ట్ చేసి తొక్కకుండా కేవలం బైక్ పెడల్ పై కాళ్లు పెట్టుకొని ఎంచక్కా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు.

కాకపోతే పెట్రోల్ అవసరం అవుతుంది.

ఈ సైకిల్ కు సంబంధించిన వీడియో చూసిన వారంతా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.కొందరేమో ఇది నిజమైన మోటార్ సైకిల్ ( Motorcycle )అని కామెంట్ చేస్తే.మరికొందరేమో సైకిల్ కు బైక్ ఇంజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే అంటూ సైకిల్ గురించి చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?

మరికొందరేమో ఇలాంటి ఆవిష్కరణ చాలా సంవత్సరాల కిందట జరిగిందని, అప్పుడు మరుగున పడిన మళ్లీ కొత్తగా ప్రజల్లోకి వచ్చిందని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు