అమెరికా : డ్రగ్స్ మత్తులో దారుణం.. భారతీయ విద్యార్ధిని సుత్తితో కొట్టి కొట్టి చంపిన దుర్మార్గుడు

అమెరికాలో నిరాశ్రయులుగా( Homeless ) వున్న వారి కారణంగా శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.

వీరిలో చాలా మంది మద్యం, డ్రగ్స్‌కు బానిసలకు కావడంతో మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు.

దేశంలోని ఏ ప్రధాన నగరాన్ని తీసుకున్నా ఇదే పరిస్ధితి.వీరిని కంట్రోల్ చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

తాజాగా జార్జియా రాష్ట్రంలోని( Georgia State ) లిథోనియా నగరంలో దారుణం జరిగింది.డ్రగ్స్ మత్తులో ఓ నిరాశ్రయుడు భారతీయ విద్యార్ధిని( Indian Student ) సుత్తితో కొట్టి కొట్టి చంపాడు.

మృతుడు ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పట్టా పొందాడు, ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం.

Advertisement

నిందితుడిని జూలియన్ ఫాల్క్‌నర్‌గా( Julian Faulkner ) గుర్తించారు.ఇతను ఏమాత్రం కనికరం లేకుండా వివేక్ సైనీ( Vivek Saini ) తలపై సుత్తితో దాదాపు 50 సార్లు కొట్టి కొట్టి చంపాడు.ఈ దారుణ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ఫాల్క్‌నర్‌కు ఆశ్రయం కల్పించే దుకాణంలో పార్ట్‌టైమ్ క్లర్క్‌గా పనిచేస్తున్న వివేక్ సైనీ.నిందితుడికి మానవత్వంతో రెండు రోజుల పాటు చిప్స్, కోక్, తాగునీరు, వెచ్చదనం కోసం జాకెట్ కూడా అందించినట్లు ఎం9 న్యూస్ ఛానెల్ ఆదివారం నివేదించింది.

అయితే జనవరి 16న స్టోర్‌ నుంచి ఇంటికి వెళ్తూ.ఇక్కడే వుంటే పోలీసులతో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం వుందని వెళ్లిపోవాలని ఫాల్క్‌నర్‌కు చెప్పాడు వివేక్.

ఆ మాటలకు ఆగ్రహంతో ఊగిపోయిన ఫాల్క్‌నర్.వివేక్‌పై దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విగతజీవిగా పడివున్న వివేక్‌ పక్కన నిలబడి వున్న ఫాల్క్‌నర్‌ను గుర్తించారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

భారత్‌లోని హర్యానా రాష్ట్రానికి( Haryana ) చెందిన వివేక్ సైనీ .బీటెక్ పూర్తి చేసి రెండేళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చాడు.అతని మరణవార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

త్వరలోనే మంచి ఉద్యోగంలో చేరి గొప్ప స్థాయికి చేరుకుంటాడనుకున్న కొడుకు .తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో వారు రోదిస్తున్నారు.సైనీ చివరి చూపు కోసం అతని తల్లిదండ్రులు గుర్జీత్ సింగ్, లలితా సైనీలు ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు