Hansika : ఆ రీజన్ వల్లే ఇంటిపేరును మార్చుకోలేదన్న హన్సిక.. పెళ్లి తర్వాత అది మాత్రమే మారిందంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ హన్సిక( Hansika ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా( Desamuduru )తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.అలాగే టాలీవుడ్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హన్సిక.

ఇకపోతే సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

ముఖ్యంగా పెళ్లి తర్వాత వరుసగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.ఇకపోతే మామూలుగా హీరోయిన్లు పెళ్లి తర్వాత లైఫ్ మారిందని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని చెబుతూ ఉంటారు.కానీ హీరోయిన్ హన్సిక మాత్రం పెళ్లి తర్వాత ఎటువంటి మార్పు లేదని, పెళ్లికి ముందు ఎలా ఉందో, పెళ్లి తర్వాత కూడా అలానే ఉందని, ఎటొచ్చి తన అడ్రస్ మాత్రం మారిందని చెబుతోంది.

Advertisement

ఈ మేరకు ఆమె చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.పెళ్లి తర్వాత ఏం మారలేదు.షూటింగ్ సమయంలో క్యారెక్టర్ లో ఉంటాను.

ఇంటికెళ్లిన తర్వాత భర్తతో ఉంటాను.అంతే తేడా.

సాయంత్రం 6 తర్వాత అతనికే టైమ్ కేటాయిస్తాను.

పెళ్లి తర్వాత నా అడ్రెస్ మాత్రమే మారింది.నా ఇంటి పేరు కూడా మారలేదు.హన్సిక మోత్వానీ అనే ఐడెంటిటీ కోసం చాలా కష్టపడ్డాను.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

అందుకే పెళ్లి తర్వాత ఇంటి పేరును మార్చుకోలేదు.ఈ మేరకు ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారాయి.

Advertisement

ఇకపోతే హన్సిక విషయానికి వస్తే.ఆమె నటించిన మై నేమ్ ఈస్ శృతి అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ప్రచారంలో భాగంగానే తాజాగా హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొంది.

తాజా వార్తలు