బెయిల్ షరతుల పై విజ్ఞప్తి చేసిన హార్దిక్...తోసిపుచ్చిన కోర్టు!

గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ను అక్కడి సెషన్స్ కోర్టు తోసిపుచ్చినట్లు తెలుస్తుంది.

తన బెయిల్ షరతులను సవరించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేయగా గుజరాత్ లోని ఒక సెషన్స్ కోర్టు దానిని తోసిపుచ్చినట్లు తెలుస్తుంది.

పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హార్దిక్ పటేల్ నేతృత్వంలో 2015 ఆగస్టు 25న గుజరాత్‌లో సభ జరిగింది.అనంతరం రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి.

Gujarat Sessions Court Rejected Hardhik Patel Request Hardhik Patel, Session Cou

ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీసులు హార్దిక్ పటేల్‌పై 2015 లో దేశద్రోహం కేసు నమోదు చేశారు.అయితే ఈ కేసు విచారణ ట్రయల్ కోర్టుకు హాజరు కావాలి అంటూ పలుమార్లు కోర్టు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాకపోవడం తో ఈ ఏడాది జనవరిలో ఆయనను అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో ఆయనకు అదనపు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం తో గుజరాత్ విడిచి వెళ్ళరాదని షరతు విధించింది.ఈ నేపథ్యంలో తన బెయిల్ విషయంలో విధించిన షరతులను సవరించాలి అంటూ ఆయన తాజాగా పిటీషన్ ను దాఖలు చేయగా దానిని సెషన్స్ కోర్టు తోసిపుచ్చినట్లు తెలుస్తుంది.

Advertisement
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

తాజా వార్తలు