Revanth Reddy : త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.పోలీస్ శాఖలో పదిహేను వేల పోస్టులను భర్తీ చేస్తామన్నారు.

త్వరలోనే గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని తెలిపారు.అలాగే గ్రూప్-1 కు( Group-1 ) వయోపరిమితి 46 ఏళ్లకు పెంచుతున్నామని పేర్కొన్నారు.

అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఒక మైనారిటీని నియమించామన్నారు.గత ప్రభుత్వ హయాంలో ఒక్క మైనారిటీ అధికారికి కూడా అవకాశాలు లేవని తెలిపారు.

మైనారిటీల హక్కులను కాపాడటంలో తమకు చిత్తశుద్ధి ఉందని పేర్కొన్నారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీలోనూ ఒక మైనారిటీకి అవకాశం కల్పించామన్నారు.వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం సెర్చ్ కమిటీ వేశామని తెలిపారు.

Advertisement

త్వరలోనే వైస్ ఛాన్సలర్ల నియామకం చేపడతామని వెల్లడించారు.ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక అధికారులను నియమించామన్న ఆయన ఐఏఎస్ దివ్యను పూర్తిస్థాయి అధికారిగా నియమించామని తెలిపారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు