లడ్డూ తయారీ కేంద్రం తనిఖీ చేసిన ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం తనిఖీ చేశారు.

మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం అనంతరం విప్, కలెక్టర్, ఎస్పీ తదితరులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా వారిని ఆలయ ఈవో వినోద్ రెడ్డి శాలువాలతో సన్మానించి, స్వామి వారి ప్రసాదాన్ని అందజేయగా, అర్చకులు ఆశీర్వచనం చేశారు.అనంతరం విప్, కలెక్టర్ తదితరులు లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.

స్టోర్ రూం, లడ్డూ తయారీకి వినియోగించే పదార్థాలు, నెయ్యి, తయారీ విధానం, పరిసరాలు తనిఖీ చేశారు.రోజు ఎంత నెయ్యి వినియోగిస్తున్నారు, ఎన్ని లడ్డూలు రోజు సిద్ధం చేస్తారు? ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారో ఆరా తీశారు.లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని పూర్తిగా ఆధునీకరించాలని, భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

నాణ్యత, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.

Advertisement
Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности

Latest Rajanna Sircilla News