ధాన్యం క్వింటాల్ మూడు వేలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: సీపీఐ

సూర్యాపేట జిల్లా:ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వమే నేరుగా క్వింటా మూడు వేల రూపాయల చొప్పున రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని సిపిఐ గరిడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.గురువారం గరిడేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేసి, తహాసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వానకాలం సీజన్లో ధాన్యం మార్కెట్ కు వచ్చి 10 రోజులు అయిందని,వారం రోజుల నుండి మిల్లర్లు సన్నరకం వడ్లను,క్వింటాల్ రూ.2300 వరకు కొనుగోలు చేశారని,గత మూడు రోజులుగా మిల్లర్లు మధ్య దళరీలు కుమ్మకై ధాన్యం ధరను క్వింటాకు మూడు వందల రూపాయలు తగ్గించి,కేవలం రెండు వేల రూపాయలకే కొనుగోలు చేస్తూ,ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతును నిలువు దోపిడీ చేస్తుంటే, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కానీ,ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ,పట్టించుకోకపోవడం దారుణమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేస్తానని చెప్పిన లక్ష రూపాయలు ఋణ మాపీ వెంటనే చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికలకు కూడా ఇంకా ఒక సంవత్సరమే ఉన్నందున వెంటనే అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు త్రిపురం సుధాకర్ రెడ్డి,సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి,కడియాల అప్పయ్య,రైతు సంఘం నాయకులు జొన్నలగడ్డ తిరపయ్య,జొన్నలగడ్డ వీరయ్య,ప్రతాని సైదులు,వంశీ,నగేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్

Latest Suryapet News