మణిరత్నం దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇతర భాషల్లో పెద్దగా ఆడలేదు, కానీ ఈ సినిమా ను తమిళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజాన్ని సొంతం చేసుకుంది.
రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ను ఈ సినిమా నమోదు చేయడం జరిగింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కోసం అభిమానులు ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
దర్శకుడు మణిరత్నం మొదట్లోనే పొన్నియన్ సెల్వన్ ను రెండు పార్ట్ లు గా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.అన్నట్లుగానే ఇప్పటికే మొదటి పార్ట్ విడుదల అయ్యింది.
రెండవ పార్ట్ కు సంబంధించిన ప్రచారం మొదలు అయ్యింది.
రెండవ పార్ట్ లో ఆ హీరో… ఈ హీరోయిన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది.నాలుగు అయిదు నెలల్లో గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేస్తే విడుదలకు రెడీ అవుతుంది.
కనుక మీడియాలో వస్తున్న వార్తలు ఏవీ నిజం కాదని.అసలు ఈ సినిమా లో కొత్తగా ఏ ఒక్క స్టార్ కూడా జాయిన్ అవ్వడం లేదని యూనిట్ సభ్యులు కూడా చెబుతున్నారు.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకం తో అభిమానులు ఉన్నారు.

భారీ ఎత్తున అంచనాలున్న పొన్నియన్ సెల్వన్ స్క్రిప్ట్ రెండు పార్ట్ లు గా చేసిన సమయంలో నే భారీ విజయం పై దర్శకుడు మణి రత్నం కన్నేశాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఇప్పుడు మణిరత్నం రెండవ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశాడు కనుక ఎప్పుడెప్పడు తీసుకు వస్తాడు అంటూ తమిళ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.మొదటి పార్ట్ ఆశించిన స్థాయి లో తెలుగు ప్రేక్షకులను అలరించలేక పోయింది.
మరి రెండవ పార్ట్ అయిన తెలుగు మరియు ఇతర భాషా ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.







