శుభవార్త: రామ భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు..!

శ్రీరామ భక్తులకు శుభవార్త. చాలామంది యాత్రకు వెళ్లాలనుకుని వెళ్లలేక ఉండిపోతారు.

అలాంటి వారికి గుడ్ న్యూస్.

రామాయణ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఇండియన్ రైల్వే పలు రైళ్లను ప్రారంభించనుంది.

దేఖో అప్నా దేశ్‌’ పేరుతో కేంద్ర సర్కార్ ఓ పథకాన్ని మొదలు పెట్టింది.అందులో భాగంగా శ్రీ రామాయ‌ణ్ యాత్ర పేరుతో డీల‌క్స్ ఏసీ టూరిస్ట్ రైళ్లను మొదలు పెట్టనుంది.

ఆ రైళ్లలో 17 రోజుల పాటు యాత్ర ఉంటుంది.ఈ రైళ్ల ద్వారా శ్రీరాముని భ‌క్తులు దేశంలోని అన్ని ఆధ్యాత్మిక దేవాలయాలను దర్శించుకుని యాత్రను పూర్తి చేయవచ్చు.

Advertisement

దేశంలోని అన్ని దేవాలయాలను చూడాలనుకునేవారికి ఇదొక గొప్ప అవకాశం.ఇండియన్ రైల్వే ఈ అవకాశాన్ని తమ భక్తులకు కల్పించనుంది.

ఇండియన్ రైల్వేస్ నుంచి తాజాగా రామాయణ ఎక్స్ ప్రెస్ మరో ఎడిషన్ ను ప్రారంభించనున్నట్లుగా రైల్వే బోర్డ్ తెలిపింది.న‌వంబ‌ర్ నెల 7వ తేదీన ఈ యాత్రను ప్రారంభించనుంది.

ఢిల్లీలోని స‌ఫ్దర్జంగ్ రైల్వే స్టేష‌న్ నుంచి రామాయ‌ణ ఎక్స్ ప్రెస్ రైలు బయల్దేరనుంది.యాత్రకు వెళ్ళాలనుకునేవారు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో త‌మ టికెట్లను బుక్ చేసుకుని యాత్రకు వెల్లాల్సి ఉంటుంది.

ఇక్కడే ఇంకో కండీషన్ కూడా ఉంది.రామాయణ యాత్రకు వెళ్లాలనుకునేవారు కనీసం రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని ఉండాలి.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్

ఆ స‌ర్టిఫికెట్లను తమ వెంట తెచ్చుకుంటేనే యాత్రకు అనుమతి ఉంటుంది.రామాయణ యాత్రలో ప్రయాణికులు సుమారుగా 7,500 కి.మీ. దూరం వరకూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది.ఈ రైలులో 156 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Advertisement

మొదటి ట్రైన్ బుకింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.అయితే పర్యటన ప్యాకేజీ ధర కనిష్టంగా 7,560 రూపాయలు ఉండనుంది.ఇకపోతే ఈ యాత్రకు గరిష్టంగా రూ.16,065 ధర ఉంటుందని అధికారిక ప్రకటన ద్వారా కేంద్రం తెలియజేసింది.

తాజా వార్తలు