గాడ్ ఫాదర్ కు బిగ్గెస్ట్ మైనస్ సల్మాన్ ఖాన్.. అతనిని ఎంపిక చేసి తప్పు చేశారా?

భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.క్రిటిక్స్ ఈ సినిమాకు 2.

75 నుంచి 3.5 రేటింగ్ ఇవ్వగా ఈ సినిమా విషయంలో మెగా అభిమానులు సైతం సంతృప్తిగా ఫీలవుతున్నారు.గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఆచార్య సినిమా మిగిల్చిన చేదు జ్ఞాపకాలను చెరిపేసింది.

గాడ్ ఫాదర్ సక్సెస్ తో మెగాస్టార్ తర్వాత సినిమాలకు కూడా భారీ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది.అయితే గాడ్ ఫాదర్ కు బిగ్గెస్ట్ మైనస్ ఏంటనే ప్రశ్నకు సల్మాన్ ఖాన్ పేరు సమాధానంగా వినిపిస్తుండటం గమనార్హం.

సల్మాన్ ఖాన్ కాకుండా మరో టాలీవుడ్ నటుడు ఈ సినిమాలో నటించి ఉంటే ఈ సినిమా రేంజ్ కచ్చితంగా పెరిగి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సల్మాన్ ఖాన్ స్క్రీన్ పై కనిపించిన సన్నివేశాలు సిల్లీగా ఉండటంతో పాటు ఆ సీన్లలో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటం గమనార్హం.

సల్మాన్ ఖాన్ నటించిన సీన్లు మరీ రొటీన్ గా ఉన్నాయని ఆ సీన్లలో కొత్తదనం ఏ మాత్రం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సల్మాన్ ఖాన్ యాక్టింగ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.

Advertisement
God Father Movie Biggest Minus Point Details Here Goes Viral , God Father Movie

గాడ్ ఫాదర్ సినిమాకు సల్మాన్ ఖాన్ మైనస్ అయ్యారే తప్ప ప్లస్ కాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం.మరోవైపు గాడ్ ఫాదర్ తొలిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

God Father Movie Biggest Minus Point Details Here Goes Viral , God Father Movie

ఈ సినిమా తొలిరోజే 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.అధికారికంగా గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల గురించి మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.ఈ సినిమా నిర్మాతలకు భారీ మొత్తంలో లాభాలు దక్కడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు