గౌడన్న గోస గోవర్ధనన్న భరోసా

గౌడ కులస్తులు భరోసాగ ఉంటున్న చిధుగు గోవర్ధన్.తాటి చెట్టు పై నుండి పడి గాయపడ్డ వ్యక్తికి అయిదు వేల ఆర్థిక సాయం అందజేసిన గోవర్ధన్.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) బోయినిపల్లి మండలం లోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన ముద్దం ప్రసాద్ గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుండి జారిపడి గాయాలైనందున వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ చిదుగు గోవర్ధన్ గౌడ్( Chidugu Govardhan Goud ) తనవంతు సహాయంగా 5000 రూపాయలు పులి లక్ష్మిపతి గౌడ్ 500 , ముష్నం తిరుపతి గౌడ్ (సిరిసిల్ల ) 500 పంపించగ అట్టి మొత్తం 6000 రూపాయలు ఆర్థిక సహాయం మండల గౌడ సంఘం సభ్యులు బాధితుడు కి ఈ రోజు వారి ఇంటి వద్ద అందించారు.ఈ సందర్భంగా మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్( Ashok Goud ) మాట్లాడుతూ .జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ జిల్లా నలుమూలల ఎ గౌడన్న కు కష్టం వచ్చినా నేనున్నాను అని భరోసా ఇస్తూ, ఆర్దికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతనిస్తూ , తనదైన శైలిలో రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం ఐక్యత, అభివృద్ధి కోసం పోరాడుతున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు.అలాగే ప్రభుత్వ పరంగా కూడా గాయపడ్డ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ గారికి బాధితుడు ముద్దం ప్రసాద్ గౌడ్, బూర్గుపల్లి గ్రామ గౌడ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు బొంగాని అశోక్ గౌడ్ , నాగుల సాంబయ్య గౌడ్, తాళ్ళపళ్ళి శ్రీనివాస్ గౌడ్, నల్లగొండ శ్రీనివాస్ గౌడ్, ముద్దం రవి గౌడ్, అతికం చంద్రయ్య గౌడ్ ,పులి చంద్రయ్య గౌడ్, ముద్దం రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

Latest Rajanna Sircilla News