CPI : రూ.500 లకే నేరుగా లబ్ధిదారులకు గ్యాస్ సిలెండర్ అందించాలి: సిపిఐ

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న గ్యాస్ సిలెండర్( Gas Cylinder ) నేరుగా 500 రూపాయలకు లబ్ధిదారులకు అందించాలని సిపిఐ గరిడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.

శనివారం సూర్యాపేట జిల్లా( Suryapet ) గరిడేపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ముందు మొత్తం పైసలు చెల్లించి గ్యాస్ సిలెండర్ తీసుకొంటే ఆ తర్వాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో పైసలు జమ చేస్తామనటం కరెక్ట్ కాదని,బ్యాంకులకు వెళ్లి పైసలు తీసుకోవాలన్నా పట్టణానికి వెళ్లక తప్పదని, పట్టాణానికి వెళ్ళితే ప్రభుత్వం ఇచ్చే పైసలు అక్కడనే అయిపోతాయని అన్నారు.

తీసుకోవటం ఇవ్వటం కాకుండా మొదటనే ఐదు వందల రూపాయలు తీసుకొని గ్యాస్ సిలెండర్ ఇస్తే ఏ గందరగోళం ఉండదన్నారు.గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ( Subsidy Amount ) పైసలు బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామని చెప్పి రెండు మూడు నెలలు జమచేసి ఆ తర్వాత జమ చేయలేదని గుర్తు చేశారు.

మొత్తం పైసలు ముందు చెల్లించి గ్యాస్ సిలెండర్ తీసుకోవాలన్నా పేదలకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేరుగా లబ్ధిదారులకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలెండర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

నిర్మాతగా మారడంతో డబ్బంతా పాయె.. డిప్రెషన్‌లో ప్రముఖ టాలీవుడ్ హీరో..?
Advertisement

Latest Suryapet News