సమ్మెతో పేరుకు పోయిన చెత్త

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో, గంభీరావుపేట గ్రామంలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయిని ప్రజలు వాపోతున్నారు.

మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో, ప్రధాన వీధుల గుండా, చెత్త పేరుకుపోవడంతో పందులు స్వైర విహారం చేసి దుర్వాసన వస్తుందని ప్రజలు వాపోతున్నారు.

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున, ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Latest Rajanna Sircilla News