ఎప్పటికీ అధికారం ఒకరి చేతిలో ఉండవు.అధికారం శాశ్వతం కాదు ఇక రాజకీయాల్లో ఇది వేరీ కామన్.
ఈ రోజు అధికారం ఉందని నచ్చింది చేసుకుంటూ పోతే రేపు.రేపటి రోజు అధికారం లేనప్పుడు అన్ని వ్యతిరేకంగా మారుతాయి.
ఇక రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయంటే ఇదేనేమో.ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి కూడా లాగే ఉంది.
నెల్లూరు జిల్లా నుంచి కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా మూడేళ్లు కొనసాగారు.నాలుగు పదుల వయసులో మంత్రి చాన్స్ రావడం కీలకమైన బాధ్యతలు అందుకోవడం పైగా సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడని ముద్ర పడడంతో అనిల్ కుమార్ యాదవ్ చక్రం తిప్పారనే చెప్పాలి.
అప్పుడు పవర్ ఫుల్.ఇప్పుడు పవర్ నిల్
ఇక రాజకీయంగా నెల్లూరు జిల్లాలో అనిల్ హవా మూడేళ్ల పాటు కొనసాగింది.
బడా నాయకులు సైతం ఆ ధాటికి సైలెంట్ గా ఉండిపోయారు.అలా అనిల్ అన్నీ తానే అయి కథ నడిపించారు.
అనిల్ కి దూకుడు కూడా ఎక్కువే ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలను నోటికొచ్చినట్లు మాట్లాడారు.ఎందుకంటే నాడు మంత్రి గిరీ చేతిలో ఉంది.
దీంతో అందరూ అన్నా అంటూ వెన్నంటే నడిచారు.కట్ చేస్తే మూడేళ్లు పూర్తికాగా మలి విడత మంత్రి వర్గ విస్తరణలో అనిల్ మంత్రి పదవి పోగొట్టుకున్నారు.
ఇక ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు.సొంత ఇలాకాలోనే బ్యాడ్ అవుతున్నారు.
పైగా సొంత పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు.

ఇక నెల్లూరు జిల్లాలో నెల్లూరు సంగం బ్యారేజీల్లో మిగిలిన పది శాతం పనులను కూడా మంత్రి హోదాలో ఉండి పూర్తి చేయించలేకపోయారనే విమర్శ ఉంది.అలాగే ఆయన ఇచ్చిన అనేక హామీలు మరుగున పడ్డాయని అంటున్నారు.ఇక సోమశిల డ్యామ్ కూడా వరదలకు బాగా దెబ్బతింది.
దానికి కూడా మరమ్మతులు చేయించలేని పరిస్థితిలో నాడు మంత్రిగా ఉన్నారు.ఇక తానున్న చోట తనకు ఓటేసిన చోట అంటే నెల్లూరు సిటీలో కూడా కాలువకట్టల మీద ఇళ్లు నిర్మించుకున్నవారికి పక్కగా నివాసం ఉండేలా ఇళ్ల పట్టాలిస్తామని హామీ ఇచ్చిన అనిల్ కుమార్ దాన్ని పట్టించుకోలేకపోయారు.
పైగా ఇరిగేషన్ స్థలాల్లో పట్టాలు ఇవ్వడం కుదరదని తేల్చడంతో ఫైర్ అవుతున్నారు అక్కడి వాసులు.

ఈ ఎఫెక్ట్ తో ఈసారి నెల్లూరు సిటీలో పోటీ చేస్తే ఓటమి తప్పదన్న అంచనాకు మాజీ మంత్రి వచ్చేసినట్లు వినిపిస్తోంది.దీంతో వెంకటరిగి నియోజకవర్గం మీద కన్నేసారని టాక్.అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారు.
ఈ విషయం చాలా కాలం క్రితమే తెలుసు కాబట్టి మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడికి అక్కడ జగన్ సీటుకు హామీ ఇచ్చారని అంటున్నారు.పైగా అనిల్ కుమార్ వెంకటరిగికైతే నాన్ లోకల్ అని అక్కడి వైసీపీ నేతలే అంటున్నారట.
దాంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో అనిల్ కుమార్ యాదవ్ పడ్డారని వినిపిస్తోంది.

అంతే కాకుండా మరో ట్విస్ట్ .సొంత బాబాయ్ రూప్ కుమార్ కూడా ఇపుడు ప్రత్యర్థిగా మారిపోవడంతో మాజీ మంత్రికి తన వారు ఎవరో అర్ధం కావడంలేదట.మరి వచ్చే ఎన్నికల్లో ఆయన నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తారా… లేదా వెంకటగిరి నుంచి పోటీ చేస్తారా.
చేసినా గెలుస్తారా.అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో అనిల్ అనుచరులు అన్నకి బ్యాడ్ టైమ్ నడుస్తోందిని అనుకుంటున్నారట.ఇక వచ్చే ఎన్నికల నాటికి ఏమైనా జరగొచ్చు చూడాలి మరి.