ఎవరి కోసం ఈ దశాబ్ది ఉత్సవ ఆర్భాటాలు...?

సూర్యాపేట జిల్లా: తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) జూన్ 2 నుండి 22 వరకు నిర్వహించ తలపెట్టిన దశాబ్ది ఉత్సవ ఆర్భాటాలు ఎవరి కోసమని సీపీఐ(ఎం.

ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ విమర్శించారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ లో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సొమ్మును విచచ్చలవిడిగా ఖర్చు చేయడానికి,వివిధ కార్యక్రమాలు తలపెట్టి, అందుకు తగిన బడ్జెట్ కేటాయించడం ద్వారా ఎవరికీ మేలు జరుగుతుందన్నారు.గత 2 నెలలుగా రైతులు ఐకెపి( Farmers ) సెంటర్లలో ధాన్యం ఉంచితే,గోనె సంచులు లేవని,లారీలు రావని, ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు నిలిపి వేశారని,కొత్త ఆసరా పెన్షన్ ల ఊసే లేదని, ఉద్యోగులకు జీతాలు లేవని,ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినా ప్రభుత్వ పెద్దల కళ్ళకు కనబడడం లేదా మండిపడ్డారు.

For Whom Is The Celebratory Clamor Of This Decade...? ,Farmers, Dalit Bandhu ,S

ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేని అట్టహసాలు, ఆర్బాటాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుందన్నారు.తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఏ ప్రజాస్వామిక ఆకాంక్షలతో నిలువెత్తు ఉద్యమం నిర్మించి, వందలాది మంది బలిదానాలు చేశారో, ఆ ఆశలు,ఆకాంక్షలు ఈ పదేండ్లలో నెరవేరలేదని అన్నారు.కోటి ఆశలతో విద్యార్థులు,నిరుద్యోగులు, సకల జనులు ఉద్యమిస్తే, వాళ్ళను మోసంచేసి తెలంగాణా ద్రోహులను అందలమెక్కించారన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిన సందర్బంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని, నిలువ నీడలేని పేదలకు డబుల్ బెడ్ రూం లేదా ఇళ్ళ స్థలాలిచ్చి,ఇంటి నిర్మాణానికి రూ.10లక్షల ఇవ్వాలని,ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రతి ఒక్కరికి 10కేజీల సన్న బియ్యంతో పాటు పన్నెండు రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని, రైతులకు తక్షణమే రుణ మాఫీ చేయాలని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని, దళితులందరికీ దళిత బంధు( Dalit Bandhu ),బీసీ బంధు కూడా అమలు జరపాలని, నిరుద్యోగులందరికీ 10వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకు సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర 7వ మహాసభ జున్ 2 నుండి 12వరకు తెలంగాణ ప్రజల ఆకాంక్షల దీక్షా దివాస్ జరపాలని పిలుపునిచ్చిందన్నారు.

Advertisement

ఈ సందర్బంగా అన్ని మండలాల్లో,గ్రామాలలో దీక్షలు,ప్రదర్శనలు నిర్వహించాలని,దీనిలో ప్రజలందరూఉ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక,పి.డి.ఎస్.యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ జిల్లా నాయకులు గొడ్డలి నర్సయ్య,పేర్ల నాగయ్య, వేర్పుల లక్ష్మయ్య, మట్టపల్లి అంజయ్య, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రాంజీ, జీవన్,పద్మ తదితరులు పాల్గొన్నారు.

గ్రూప్-1 లో ఫలితాల్లో హుజూర్ నగర్ ఎమ్మార్వోకు 488 మార్కులు
Advertisement

Latest Suryapet News