పూల సాగులో అధిక దిగుబడి కోసం.. నూతన పద్ధతులు..!

సంవత్సరం పొడుగునా ఏ సీజన్లోనైన పూలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.పాత రోజుల్లో అయితే కేవలం పండగ సమయంలో మాత్రమే పూలను ఎక్కువగా వినియోగించేవారు.

ఈ మధ్యకాలంలో పూల వాడకం విపరీతంగా పెరిగింది.ఇతర రాష్ట్రాల నుండి పూలను దిగుమతి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

కానీ పూలకు ఒక రోజు ఉన్న ధర మరొక రోజు ఉండదు కాబట్టి లాభాలు ఏ రీతిలో ఉంటాయో, నష్టాలు కూడా అదే రీతిలో ఉంటాయి.కేవలం ఒక పండగ రోజు మాత్రమే పూల ధర ఆకాశాన్ని అంటుతుంది.

మిగతా రోజులలో డీల పడిపోతుంది.పూలను అవసరమైన సందర్భంలో మార్కెట్లోకి తీసుకురాగలిగితే ఆశించిన స్థాయిలో లాభాలు పొందవచ్చు.

Advertisement

ఫ్లవర్ ఫోర్సింగ్ విధానం ద్వారా పూల సాగు చేస్తే మంచి లాభం పొందవచ్చు.ఉదాహరణకు దసరా దీపావళి పండగలకు ఎక్కువగా బంతిపూలను వినియోగిస్తారు.

అదే ప్రేమికుల రోజు ఎక్కువగా గులాబీ పూలు అవసరం అవుతాయి.ఈ పద్ధతిని రెండు విధాలుగా అనుసరించవచ్చు.

మొదటిది పూలు లభించని సమయాలలో, రెండవది నిర్దిష్ట తేదీలో కచ్చితంగా పూల ఉత్పత్తి అవసరం అయినప్పుడు, ఈ పద్ధతి ద్వారానే పూల సాగు చేయాలి.

మనకు అవసరమైన పూలు మార్కెట్లో లభించనప్పుడు ఆ కాలాన్ని ఆఫ్ సీజన్ అంటారు.అంటే ఆ సీజన్లో అవసరమయ్యే పూలు ఒక నెల అటు లేదా ఇటు గా మార్కెట్ కు వస్తాయి.ఫ్లవర్ ఫోర్సింగ్ విధానం ద్వారా ఆ నెలలో కూడా పూల సాగు చేయవచ్చు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
బేబమ్మ చీరలో కేక పెట్టిస్తోన్న అందాలు.. కృతి శెట్టి గ్లామర్ షో

ఇక ప్రేమికుల రోజు గులాబీ పూలు, దసరా దీపావళి పండుగలకు బంతిపూలు అవసరం అవుతాయి.అంటే నిర్దిష్ట తేదీన పూలు ఉత్పత్తి కావాలి అంటే ఈ ఫ్లవర్ ఫోర్సింగ్ విధానం తోనే సాధ్యం.

Advertisement

ఇక వానాకాలం, చలి కాలాలలో కొన్ని సందర్భాల్లో మాత్రమే చీడపీడల బెడద విపరీతంగా ఉంటుంది.సీజన్ కు కాస్త ముందుగాని, కాస్త తర్వాత గాని పూల సాగు ప్రారంభిస్తే మంచిది.ఇక అందరిలాగా సాధారణ సమయంలో కాకుండా, మిగతా సమయాలలో పూల సాగు చేయడం ద్వారా ఉపాధికి కూలి దొరకడంతో పాటు ఆఫ్ సీజన్లో పూల ఉత్పత్తి జరిగితే అధిక లాభం పొందవచ్చు.

తాజా వార్తలు