బిజీ రోడ్డు పై కారు నడిపిన బుడ్డోడు.. తల్లిదండ్రులపై చివరకు..?!

ప్రపంచంలో ఎదోఒక్క ప్రాంతంలో ఏదొఒక్క అరుదైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.మనకు తెలిసినంత వరకు ఐదేళ్ల పిల్లలు ఆటలు ఆడుకుంటూ.

తమ తోటి వయస్సు పిల్లలతో ఆటలు ఆడుకుంటూ ఉంటారు.అయితే ఐదేళ్ల బాలుడు ఏకంగా కారును నడుపుతున్నాడు.

ఈ అరుదైన ఘటన పాకిస్తాన్ ‌లో చోటు చేసుకుంది.ఆ బాలుడు అది బొమ్మకారు అనుకోని నడిపాడో లేక ఇంకా ఏమైనా అనుకున్నాడో తెలీదు కానీ ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.పాకిస్తాన్‌ లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన ముల్తాన్‌ రోడ్డులో ఓ బాలుడు బ్లాక్‌ టయోట కారును నడిపాడు.

Advertisement
5 Year Old Kid Driving Land Cruiser In Pakistan, 5 Year Old Kid, Driving Car, Vi

ఇక ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈ వీడియోలో బాలుడు స్టీరింగ్‌ ఎదురుగా నిలబడి నిరంతంరం రద్దీగా ఉండే రోడ్డుపై అతి వేగంగా కారు నడుపుతూ కనిపించాడు.

ఇక ఇంకో విషయం ఏంటి అంటే.ఆ కారులో బాలుడి తల్లిదండ్రులు కానీ.

వేరే పెద్దవాళ్లు కానీ లేకపోవడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది.అయితే ఇప్పడు ఈ వీడియో పోలీసుల కంటపడింది.

దీంతో పోలీసులు వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్‌ పోలీసు ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

5 Year Old Kid Driving Land Cruiser In Pakistan, 5 Year Old Kid, Driving Car, Vi
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ఈ ఘటనకు సంబంధించి చీఫ్‌ ట్రాఫిక్‌ ఆఫీసర్‌ జాఫర్‌ బుజ్గార్‌ మీడియాతో మాట్లాడుతూ.ఆ బాలుడితో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసిన బాలుడి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఇక ఆ ఆ బాలుడి వయసు కేవలం 5 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

అతి చిన్న వయసులోనే కారు నడపడానికి అనుమతి ఇచ్చిన అతడి తల్లిదండ్రులపై నెటిజన్ ‌లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఇక తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనం ఆయన అన్నారు.

అతడితో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ఈ బాలుడి తల్లిదండ్రులు ప్రమాదంలో పడేసినట్లు అయ్యింది.‘తమ సొంత పిల్లవాడిపై కూడా వారు శ్రద్ధ పెట్టలేక పోయారు’ అంటూ నెటిజన్‌ లు విమర్శల జల్లులు కురిపిస్తున్నారు.

తాజా వార్తలు